తెలంగాణ

నేడు ఓపెన్ స్కూలింగ్ జాబ్‌మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో 28వ తేదీన శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నారు. నేషనల్ ఓపెన్ స్కూలింగ్ నుండి టెన్త్ లేదా ఇంటర్ చదివి ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులు. ఎన్‌ఐఓఎస్ ఆధ్వర్యంలో యురేకా ఫోర్బ్సు వారి ద్వారా సేల్స్ ట్రైనీ పోస్టులు ఎంపికకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు 8వేల వేతనం ప్లస్ ఇనె్సంటివ్స్ ఇస్తామని ఎన్‌ఐఒఎస్ సంస్థ పేర్కొంది. అలాగే పరిశ్రమల్లో రెండు వారాల ప్రాక్టికల్ శిక్షణ కలిగిన స్వల్పకాలిక నైపుణ్య శిక్షణకు రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున
పార్కుల్లో ఉచిత ప్రవేశం

హైదరాబాద్, మే 27: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన హైదరాబాద్‌లోని అన్ని పార్కుల్లో ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తున్న పలు పార్కుల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు. జూన్ రెండున ఈ పార్కుల్లో ఉచితంగానే ప్రవేశం కల్పిస్తారు. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు పార్కుల్లో ఎలాంటి రుసుం లేకుండా అనుమతిస్తారు. ఈ మేరకు హెచ్‌ఎండిఏ ఉత్తర్వులు జారీ చేసింది.