తెలంగాణ

ఖరీఫ్‌లో కన్నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 6: ఖరీఫ్‌లో పంటలకు నీరు అందించకుండా కర్షకులను కేసీఆర్ సర్కార్ కన్నీళ్లు పెట్టిస్తోందని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో పంటలకు వర్షాలు లేక ఒకవైపు, శ్రీరాంసాగర్ కాలువల ద్వారా నీరు అందక మరోవైపు పంటలు ఎండిపోతుండడంతో కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారని, రైతులను కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడు సాగించలేదని జీవన్‌రెడ్డి శాపనార్థాలు పెట్టారు. రైతుల పాలిట ఆధునిక ఆలయమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నమ్ముకొని రైతాంగం ఆశలను ప్రభుత్వం అడియాసలు చేస్తుందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లో 16టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగుకోసం కాలువల ద్వారా నీరు అందించకపోవడం విచారకరమన్నారు. ఖరీఫ్ పంటలను కాపాడాలని రైతులు గత వారం రోజులుగా మొరపెట్టుకుంటూ,ప్రాజెక్టుల వద్ద ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనిఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంటల కోసం రైతులు ఇప్పటికే కనీసం రూ. 50వేల వరకు అప్పులు చేశారని, సాగునీరు అందించకుంటే వారి పరిస్థితి ఏమిటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పంటలకు నీరు అందించకుండా, ఖరీఫ్ కష్టాలు తీర్చని ప్రభుత్వం ఉండి ఫలితం ఏమిటనీ ధ్వజమెత్తారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి