తెలంగాణ

కెసిఆర్ నెం.1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరని దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు నంబర్ వన్ స్థానం దక్కింది. ఓటర్ల మనోగతాలపై సర్వేలు నిర్వహించే విడిపి అసోసియేట్స్ అనే సంస్థ దేశంలో మోస్ట్ పాపులర్ సిఎం ఎవరన్నదానిపై ఇటీవల సర్వే నిర్వహించింది. గతంలో ఇదే సంస్థ సాధారణ సర్వే నిర్వహించి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ముందుగా చెప్పింది. జిహెచ్‌ఎంసి ఎన్నికలపై కూడా సర్వే నిర్వహించినట్టు ఈ సంస్థ పేర్కొంది. తాజాగా దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ సిఎంపై నిర్వహించిన సర్వేలో 86 శాతంతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి స్థానంలో నిలువగా, 81 శాతంతో రెండవ స్థానంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, 75 శాతంతో మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, 72 శాతంతో నాలుగవ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, 69 శాతంతో ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 65 శాతంతో ఆరవ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, 61 శాతంతో ఏడవ స్థానంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, 59 శాతంతో ఎనిమిదో స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, 58 శాతంతో తొమ్మిదవ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, 52 శాతంతో పదవ స్థానంలో గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పరేసర్ నిలిచినట్టు సర్వేలో తేలింది.