తెలంగాణ

కోదండరాం అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, ఆగస్టు 6: రైతులను పరామర్శించేందుకు నిజామాబాద్ జైలుకు వెళ్తున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ గేట్ వద్ద పోలీస్‌లు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, రైతులపై ప్రేమ చూపిస్తున్నామని, చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రాజెక్టు కాల్వల నుంచి జాలువారే నీటితో పంటలు సాగు చేసుకునేందకు నీళ్ళను అడిగితే నీళ్ళను వాడుకొనివ్వకపోగా, పోలీస్‌లతో ఆయా గ్రామాల రైతులను పోలీస్ క్యాంప్‌లతో నిర్బంధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వర్షాలు లేక కళ్లెదుటే పంటలు ఎండి పోతుంటే 21 గ్రామాల రైతులు నీళ్ళ కోసం ఆందోళనకు దిగితే నీళ్ళు ఇవ్వమని, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తామని చెప్పడం విడ్డూ రంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆడ్డంకులు సృష్టించినా తమ కార్యచరణతో ముందుకు సాగుతామన్నారు. ప్రభుత్వ ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన కేసుల్లో రైతు కూలీ సంఘం నాయకుడు ప్రభాకర్‌ను విడుదల చేయాలని, రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహారించుకోవాలని, డిమాం డ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పిదాలు ప్రపంచానికి ఎక్కడా తెలుస్తాయోనన్న ఉద్దేశంతో మానోర్లు నొక్కుతూ ముందస్తు అరెస్టు చేయడం ఆనైతికం అన్నారు. రైతులపై ప్రభుత్వం ఏవిధంగా వ్యవహారిస్తోందో ఈ విషయంలో అర్థం అవుతుందని విమర్శించారు. లీకేజీల ద్వారా విడుదల అయ్యే ఆర టీఎంసీల నీళ్ళతో 21 గ్రామాల రైతుల పంటలు తామ పంటలను పండించుకొని సంతోషంగా ఉండే వారని, ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్ర వల్ల రైతుల్లో భయాందోళనలు నెలకొన్నా యన్నారు. నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, శ్రీ్ధర్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం...కోదండరామ్‌ను పోలీసు జీపులో పడేస్తున్న పోలీసులు