తెలంగాణ

ఉన్నత విద్యావ్యాప్తిలో జయశంకర్ పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ఉన్నత విద్య అందుబాటులో ఉండేలా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ చేసిన కృషి ఎనలేనిదని కాకతీయ వర్శిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శంకరయ్య పేర్కొన్నారు. ప్రొ.జయశంకర్ 84వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్శిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ శంకరయ్య ఉన్నత విద్యావ్యాప్తి, సంస్థాగత నిర్మాణంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. ఉన్నత విద్యావ్యాప్తిలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారని, ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా పదవులను ఆశించకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి ప్రొ.జయశంకర్ పనిచేశారని అన్నారు. తన ఆలోచనలు అన్నీ తెలంగాణ రాష్ట్ర సాధన చుట్టూ మాత్రమే తిరిగేవని చెప్పారు. వైస్ ఛాన్సలర్ ప్రొ.కే సీతారామారావు మాట్లాడుతూ జయశంకర్‌తో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ వైతాళికుల్లో జయశంకర్ పాత్ర సుస్థిరం అని అన్నారు. కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి వెంకటయ్య, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై ఎస్ కిరణ్మయి, పలువురు డైరెక్టర్లు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఉద్యోగులు అంతా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.