తెలంగాణ

వెరికోస్ వెయిన్స్‌తో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: కండరాల్లో రక్తప్రసరణ జరిగేలా చురుగ్గా ఉండాలని జూబ్లీహిల్స్, అపోలో ఆసుపత్రి పెరిఫెరల్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ సి. చంద్ర శేఖర్ ప్రజలకు సూచించారు. వెరికోస్ వెయిన్స్ అభివృద్ధి చేయకుండా ఆలస్యం చేయవద్దని, నివారణే సరైన చికిత్స అని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వంశపారంపర్యంగా, వయస్సుపరంగా ఏర్పడే సమస్య ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి రక్తప్రసరణ జరిగే విధంగా కాలి కండరాలను కదిలిస్తూ ఉండాలని, రక్తపోటసను నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. లక్షణాల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు, పడుకుని గుండె కంటే ఆరు అంగుళాల ఎత్తులో కాళ్లను లేపాలని, దీనిని పది నిమిషాల వ్యవధితో ప్రతి రోజూ కొన్ని సార్లు చేయాలని ఆయన తెలిపారు. పైగా సాధారణ బరువును కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. వెరికోస్ వెయిన్స్‌కు దారి తీసే మీ కాళ్లలో కారకాలను నిర్ధారించగల అర్సత కలిగిన వాస్కులర్ సర్జన్‌ను సంప్రదించాలని, వైద్యుడు సూచించిన కంప్రెషన్ స్టాకింగ్‌లను ధరించాలని ఆయన తెలిపారు. అనేక రకాల చికిత్సల ఎంపికలు ఉన్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ సి. చంద్ర శేఖర్ పేర్కొన్నారు. స్కిన్ ఫిగ్మంటేషన్ (చర్మ కణజాలం యొక్క సహజ రంగు కోల్పోవడం), చర్మం మృధుత్వాన్ని కోల్పోవడం (ఇండ్యురేషన్) వంటివి దీర్ఘకాలిక వెరికోస్ వెయిన్స్‌వొ నిలకడగా కనిపించే లక్షణం, దీంతో పాటు కాలు భారంగా, అశాంతిగా, బాధగా అనిపిస్తుందని ఆయన వివరించారు.