తెలంగాణ

సచివాలయం మార్చవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: సచివాలయాన్ని మార్చాలన్న నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సచివాలయాన్ని మార్చే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో సచివాలయాన్ని యధాతధంగా కొనసాగించడమే ఉత్తమమని అభిప్రాయపడటం వల్లనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి కారణమని అధికార వర్గాల సమాచారం. సచివాలయాన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణకు మార్చాలని మంత్రివర్గం ప్రతిపాదించి దానికిగాను నిధులు కూడా మంజురు చేసిన విషయం తెలిసిందే. అయితే సచివాలయాన్ని మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు పాలకపక్షానికి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో సచివాలయాన్ని మార్చడంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే సచివాలయాన్ని ప్రస్తుతం ఉన్నచోటనే కొనసాగించాలని కమిటీ సూచించడంతో ప్రస్తుతం ఉన్న చోటనే వాస్తుకు అనుగుణంగా పునర్నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఉన్న సచివాలయం శాసనసభ, అకౌంటెంట్ జనరల్, ట్రిబ్యునల్, హైకోర్టు వంటి కీలకమైన కార్యాలయాలకు అందుబాటులో దగ్గరగా ఉండటంతో ఇక్కడే కొనసాగించడం ఉత్తమని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. సచివాలయాన్ని మార్చడం వల్ల ఇబ్బంది, పాలనాపరంగా అసౌకర్యం ఏర్పడుతుందని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే ఎర్రగడ్డలో అఖిల భారత సర్వీసు అధికారులు (ఐఏఎస్, ఐపిఎస్), హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్స్ (హెచ్‌ఒడి) అధికారుల నివాస గృహాల సముదాయం నిర్మించడానికి అనుకూలంగా ఉంటుందని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పాటు ఎర్రగడ్డలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి విమానయాన శాఖ నుంచి కూడా అనుమతి రాదని, అలాగే అటు వైపు వెళ్లడానికి ఉండే విపరీతమైన ట్రాఫిక్ సమస్యను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడమే నిర్ణయాన్ని మార్చుకోవడానికి కారణమని ఈ వర్గాల సమాచారం.