తెలంగాణ

కెసిఆర్ మాటలు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 27:కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా, ఇవ్వడం లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని రకాలుగా సాయం అందజేస్తోందని, అయినా నిధులు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.6 వేలకోట్ల సహయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనపై నిర్వహించిన ‘ప్రగతిపథంలో భారత్’ (వికాస్ పర్వ్) కార్యక్రమానికి ఆయన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో కలసి హాజరయ్యారు.
కాగా 2019లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని రమణ్‌సింగ్ జోస్యం చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయిందన్నారు. బిజెపి ఓటు బ్యాంకు 47 శాతంకు చేరుకుందని, కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 శాతం ఓటు బ్యాంకు మాత్రమే అని చెప్పారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడానికి సులువైన మార్గాలు ఉన్నాయని, ఓ చేతిలో బిజెపి జెండా పట్టుకుని మరో చేతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనుల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంచాలని చెప్పారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగి అధికారంలోకి రావాలని అందుకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని రమణ్‌సింగ్ పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని బిజెపి ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల కన్నా తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధిక సహాయం చేశారని పేర్కోన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ 12 పార్లమెంట్ స్థానాలను గెలిచి తెలంగాణలో బిజెపి జెండాను ఎగురవేస్తామన్నారు.

మహబూబ్‌నగర్‌లో శుక్రవారం బిజెపి నిర్వహించిన ‘వికాస్ పర్వ్’లో ప్రసంగిస్తున్న చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్