తెలంగాణ

టార్గెట్ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తెలంగాణ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మహానాడు మూడు రోజుల అజెండాలో 28, 29 తేదీల్లో ఆరు అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, నిశితంగా విమర్శించేందుకు టిడిపి నేతలు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా చర్చకు సిద్ధం కావడం విశేషం. 28న (శనివారం) సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ అసమగ్ర విధానాలు, టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొరవడిన సామాజిక న్యాయం, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం, టిఆర్‌ఎస్ హామీలు, వైఫల్యాలు, మైనార్టీ గిరిజన రిజర్వేషన్లు ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ పథకాలు, మితిమీరిన అవినీతి అంశాలపై మహానాడులో చర్చ జరగనుంది. కాగా శుక్రవారం తెలంగాణలో సంక్షోభంలో వ్యవసాయం , రైతుల ఆత్మహత్యలు, కరవు సహాయక చర్యలు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యం అంశాలపై చర్చ జరిగింది. ఈ అజెండాలోని అంశాలను విశే్లషిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికార టిడిపిపై వచ్చిన విమర్శలు, పార్టీ తీరుపై ఆత్మావలోకానికి టిడిపి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడడం లేదు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులు రాష్ట్ర విభజన తర్వాత కూడా అదుపులో ఉన్నాయని గణాంక వివరాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించేందుకు టిడిపి మొగ్గు చూపిస్తున్నదంటే కెసిఆర్‌ను ఇరుకున పెట్టాలనేదే ఆ పార్టీ వ్యూహం.
సాగునీటి ప్రాజెక్టులు- అసమగ్ర విధానాల అంశంపై కూడా టిడిపి వైఖరి ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే తెలంగాణ గోదావరి, కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అధికార టిడిపి కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ చర్చలో తెలంగాణ టిడిపి నాయకులు సైతం మాట్లాడతారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు ఎలా ఉన్నా, తెలంగాణ వారితో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సాగించే ప్రసంగాల వల్ల టిఆర్‌ఎస్ కన్నా తెలంగాణ టిడిపి నేతలకే ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ పరిస్థితి అసలే అడుగంటినట్టుగా ఉంది. ఇక టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొరవడిన సామాజిక న్యాయంపై జరిగే చర్చలో ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. టిఆర్‌ఎస్ హామీలు వైఫల్యాల అంశానికి వస్తే ఆంధ్రాలో కూడా రైతుల రుణమాఫీలో టిడిపి ప్రభుత్వం తెలంగాణ కంటే వెనకబడి ఉందనే విమర్శలున్నాయి. కాగా, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టిసారించకుండా తెలంగాణపైనే మహానాడులో చర్చించడం పార్టీకి ఏ విధంగా ప్రయోజనమో అర్థం కావడం లేదని టిడిపి నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
chitram..
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణతో నారా లోకేశ్