తెలంగాణ

టీఆర్‌ఎస్ పాలనలో కొత్త కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: తెలంగాణ సర్కార్ రైతును రాజుగా మార్చాలని లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని.. రైతుబంధుతో ఆత్మవిశ్వాసం, బీమాతో రైతుల్లో ధీమా భరోసా కల్పిస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రైతులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే.. రైతు కుటుంబాలు రోడ్డున పడేవని.. గత పాలకులు వారిని పరామర్శించేందుకు వెళ్లెవారు కాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులందరికి ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా బూర్గుపల్లి లావాణ్య గార్డెన్‌లో రైతులకు బీమా బాండ్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 15 నుండి రైతుబీమా పథకం అమలులోకి వస్తుందన్నారు. రైతు బీమా కోసం తెలంగాణ సర్కార్ వెయ్యికోట్లు వెచ్చిస్తుందని, ప్రతి యేట రెన్యూవల్ చేయించి బీమా సొమ్మును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రమాద వశాత్తు రైతులు మృతిచెందితే వారం రోజుల్లో బీమా డబ్బు రైతు కుటుంబానికి అందుతుందన్నారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, భరోసా కల్పించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పెట్టుబడులు లేక, అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, టీఆర్‌ఎస్ సర్కార్ అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెంచి ఆత్మహత్యలను తగ్గించిందన్నారు. రైతులకు 24 గంటలకు విద్యుత్, రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 8వేలు అందించి ఆత్మవిశ్వాసం పెంచి పోషిస్తుందని, బీమాతో వారికి ధీమాను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ రైతుల చీకటిని పారదోలి, రైతుల కళ్లలో నూతన కాంతులు వెదజల్లుతుందన్నారు. రైతులు సంఘతిత శక్తిగా ఎదిగి ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నాడన్నారు.
రైతుల సాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగించే బృహత్తర కార్యక్రమం వేగంగా జరుగుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల కళ్లలో కొంత కాంతులు వెదజల్లుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం యుద్ధప్రాతిపదికన పగలు, రాత్రి నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులంటే కొన్ని దశాబ్ధాలు పట్టెదని, ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు నిర్మాణం 33 ఏండ్ల పాటు నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మరో ఏడాదిలో సాగునీరు అంది రైతుల పొలాల్లోకు నీరు వస్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువును పూర్తిగా తొలగించవచ్చన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏంత ఖర్చయిన భరించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడన్నారు. ఈ ఏడాది వర్షాలు లేకున్న ఇప్పటికే 500 టీఎంసీల నీరు గోదావరీలో వృధాగా కలసిపోయిందన్నారు. వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకొని రైతుల్లో ఆనందం నింపనున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదన్నారు. తెలంగాణ సర్కార్ నాలుగేళ్లలో 12లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిందని, 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. చెరువుల ద్వారా 12 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు స్థిరికరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. వాన కాలం వచ్చిదంటే ఉసిర్లు వస్తాయని.. ఓట్లు వస్తున్నాయంటే కాంగ్రెసోళ్లు వస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటైతదన్న కాంగ్రెస్ పార్టీయే చీకటీలో కలసిపోయిందని విమర్శించారు.
చిత్రం..సిద్దిపేటలో రైతుబీమా బాండ్స్ పంపిణీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు