తెలంగాణ

కొత్తగా 17వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: గ్రామాలలో పారిశుద్ధ్యం నిర్వహణకు కొత్తగా 17 వేల మంది సిబ్బందిని నియమించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరికి నెలకు రూ.8500 తగ్గకుండా వేతనం చెల్లించాలని సీఏం ఆదేశించారు. రాష్ట్రంలో 12,751 గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న 27 నుంచి 28 వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని కొనసాగిస్తామని స్పష్టం చేసారు. ఆగస్టు 15 నుంచి నెల రోజుల పాటు నిర్వహించాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఏం సమీక్షించారు. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి 44 వేల మంది సిబ్బంది అవసరమని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనా వేసారన్నారు. ప్రస్తుతం ఉన్న 27-28 వేల మంది సిబ్బందిని కొనసాగించడంతో పాటు కొత్తగా 17 వేల మంది సిబ్బందిని నియమించుకోవాలని సీఏం ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు, డివిజన్ పంచాయతీ అధికారులు, ఈవోపీ ఆర్డీఓలు శ్రద్ధ వహించాలని, గ్రామ స్థాయిలో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు.