రాష్ట్రీయం

26 మంది సీనియర్ ఐఎఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ఆంధ్రప్రదేశ్‌లో 26 మంది సీనియర్ ఐఎఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత 15రోజులుగా కొనసాగుతున్న ఈ కసరత్తు శుక్రవారం నాటికి కొలిక్కి వచ్చింది. అటవీశాఖ స్పెషల్ సిఎస్‌గా ఉన్న అశ్విని కుమార్ పరీడాను పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ స్పెషల్ సిఎస్‌గా బదిలీ చేశారు. రెవిన్యూ శాఖ స్పెషల్ సిఎస్ అజేయకల్లంను ఆర్ధిక శాఖ స్పెషల్ సిఎస్‌గా బదిలీ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ దినేష్‌కుమార్‌ను గృహనిర్మాణశాఖ స్పెషల్ సిఎస్ గా నియమించారు. ప్రస్తుతం ఉన్న పదవిలో కొనసాగుతునే ఆయన ఈ శాఖను కూడా చూస్తారు. అటవీ పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శిగా పి వి రమేష్‌ను నియమించారు. అదనంగా కేంద్రప్రభుత్వంతో వివిధ పర్యావరణ అనుమతుల అంశాలను కూడా పర్యవేక్షిస్తారు. జిఎడి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా జగదీస్ చంద్ర శర్మ అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆయన భూములు శాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఆదిత్యనాధ్ దాస్‌ను పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిగా నియమించారు. ఆయన పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యను కూడా పర్యవేక్షిస్తారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ విజయ్‌కుమార్ మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఆర్‌పి సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. దాంతో పాటు ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ , ఎంట్రిప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్‌డిపార్టుమెంట్‌లను కూడా పర్యవేక్షిస్తారు. శంషార్ సింగ్ రావత్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు. సోలమన్ అరోకియా రాజ్‌ను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా నియమించారు. ఐ శ్రీనివాస శ్రీనరేష్‌ను చేనేత శాఖ కార్యదర్శిగా నియమించారు. నరేష్ పెనుమాకను చేనేత శాఖ ఎపి హాండ్లూమ్ కార్పొరేషన్ జెఎండి సిఇఓగా నియమించారు. లవ్ అగర్వాల్‌ను రెవిన్యూ శాఖ కార్యదర్శిగా, విపత్తుల నివారణ శాఖ కమిషనర్‌గా నియమించారు. శశిభూషన్ కుమార్‌ను జలవనరుల శాఖ కార్యదర్శిగా నియమించారు. జిఎస్‌కెఆర్ విజయకుమార్‌ను సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా నియమించారు. ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్‌ను ఆరోగ్యం- కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడిగా నియమించారు. ఎం రామారావును సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడిగా నియమించారు. సిహెచ్ శశిధర్‌ను పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిప్యూటీ కార్యదర్శిగా నియమించారు. గుర్రాల శ్రీనివాసులును సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు. సర్వ శిక్షా అభియాన్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్ అధికారి వి బి రమణమూర్తిని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా నియమించారు. ఎపి టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐడిఇఎస్‌కు చెందిన వాలేటి ప్రేంచంద్‌ను నియమించారు. ఎపి సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఐడిఇఎస్‌కు చెందిన సుర బాలకృష్ణను నియమించారు. ఎపి స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండిగా ఐఎఫ్‌ఎస్ అధికారి వై మధుసూధనరెడ్డిని నియమించారు. ఆయుష్ కమిషనర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారి ఎం రేవతిని నియమించారు. మరో ఐఎఫ్‌ఎస్ అధికారి డి నళిని మోహన్‌ను అటవీ శాఖకు పంపించారు. సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా ఉన్న ప్రసన్న వెంకటేష్‌ను ఐటిడిఎ పార్వతీపురం ప్రాజెక్టు ఆఫీసర్‌గా నియమించారు. కల్నల్ వి రాములును ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియమించారు. ఇజిఎస్ డైరెక్టర్ సి నాగరాణిని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ కార్యదర్శిగా నియమించారు.