తెలంగాణ

అధికారంలోకొస్తే అవినీతిపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలంగాణ జన సమతి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్‌కేఎం గ్రాండ్ హోటల్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అనైతిక, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఒక కాంట్రాక్టర్ కోసం పాలన సాగుతున్నట్టుగా ఉందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తీవ్ర అవినీతి చోటుచేసుకుంటోందని, రాష్ట్ర నిధులన్ని కాళేశ్వరం స్వరంగంలోకి పోతున్నాయని వాపోయారు. ప్రాజెక్టులు రైతుల కోసం కాకుండా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల కోసం నిర్మించుకోవడమే ఇందుకు కారణం అన్నారు. విచ్చలవిడిగా సాగుతున్న అవినీతిపై జుడిషియల్ ఎంక్వైరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
భూ ప్రక్షాళన అవకతవకలు జరిగాయని, ఎంతో మంది రైతులకు భూములు లేకుండా పోయాయని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుతో ముడిపడి పోయాయని, ప్రజల కోసం రాజకీయాలను నడపాలన్నదే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. అందు కోసం గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీకి వెళతామని, ఏ ఒక్క పార్టీకి తాము తోక పార్టీగా ఉండదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఒంటరిగా అన్ని స్థానాల నుంచి పోటీ చేసి, అధికారంలోకి రాగనే లక్ష ఉద్యోగాల భర్తీ, అందరికి ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు రూ.2500 నిరుద్యోగ భృతిని అందిస్తామని చెప్పారు. దిల్లీ పర్యటనలో భాగంగా అజిత్‌సింగ్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్‌తో పలు అంశాలపై చర్చించినట్టు, వారు పూర్తిగా మద్దతు ఇస్తామని ప్రకటించారని చెప్పారు. ప్రత్మామ్నాయ రాజకీయాలు రాకుండా ప్రత్యామ్నాయ అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
పర్యటనలను అడ్డుకోవడం సరికాదు
పర్యటనలను అడ్డుకోవడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సమావేశాలు జరుపుకునే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లకుండా రాహుల్‌ని అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించాలన్నారు.