రాష్ట్రీయం

సామాజిక సేవలో సింగరేణి భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: సింగరేణి యాజమాన్యం సామాజిక సేవలను చేపట్టడంతో పాటు అమలుకు కృషి చేయడంలో సఫలం అవుతోందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు.శుక్రవారం హైదరాబాద్ రాజభవనంలో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం గ్రామ, పట్టణాల్లో సామాజిక అంశాలపై విస్తత్రంగా ప్రచారం చేయడం పట్ల యువకులు ఆకర్శితులు అవుతారని ఆయన చెప్పారు. 2017-18 సంవత్సరానికి ఉత్తమ సేవా అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు సింగరేణికి దక్కడం సంతోషంగా ఉందన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లో వందలాది మందికి సోకిన థలస్సేమియా,సికిల్‌సన్ వ్యాధి నివారణకు సింగరేణి దాదాపురూ. 17 లక్షలు వెచ్చిండం జరిగిందన్నారు. ప్రతియేటా సింగరేణి సామాజిక సేవలను ప్రోత్సహించడం పట్ల యాజమాన్యం కార్మికుల పక్షపాతిగా ముద్రమడిందన్నారు.సమావేశంలో సింగరేణి డైరెక్టన్లతో పాటు సంస్థ పౌరసంబంధాల అధికారి మహేష్ పాల్గొన్నారు.

చిత్రం..గవర్నర్ నరసింహన్ నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ ప్రకటించిన
ఉత్తమ అవార్డును అందుకుంటున్న సింగరేణి సీఎండీ శ్రీ్ధర్