తెలంగాణ

చేనేత, నేత కార్మికులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చేనేత, నేత కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌కు వచ్చిన పద్మశాలీ సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఏం మాట్లాడుతూ, ‘చేనేత, నేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంచే చీరలతో పాటు ఇతరత్రా ప్రభుత్వ అవసరాలకు వస్త్రాలను సేకరించి మార్కెటింగ్ సమస్య రాకుండా చేస్తుంది. మరమగ్గాలను వందకు వందశాతం ప్రభుత్వ నిధులతో ఆధునీకరిస్తున్నాం. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. ఈ చర్యల వల్ల కొంత ఉపశమనం లభించింది. మరమగ్గాల కార్మికులకు నెలకు రూ.15-20 వేల ఆదాయం వస్తుంది. ఇది కొంత మేరకు ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఇంకా చేనేత వృత్తిలోనే కొనసాగుతసన్న వారికి, మరమగ్గాలపై పని చేస్తున్న వారికి కొంత మేరకు ఈ ప్రయత్నాలు మేలు కలిగింది. కానీ వృత్తినరి వదిలేసిన వారిని, వేరే ఉపాధి చూసుకునే వారిని గుర్తించి వారికి అవసరమైన చేయూత అందించాల్సిన అవసరం ఉంది’ అన్నారు.
నేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే పద్మశాలీల అభ్యున్నతికి బహుమఉఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలీ సంఘం కలిసి పని చేయాలని సీఏం పిలుపునిచ్చారు. ఇప్పటికే చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించడంతో పాటు వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మర్గాలు చూపాలన్నారు. కాలం మారుతున్న కొద్దీ సామాజిక మార్పులు సంభవిస్తాయని, వీటికి అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. పద్మశాలీ సంక్షేమానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
ఈ నిధులను సద్వినియోగం పరుచుకుని శాశ్వత పరిష్కారాలు చూపాలన్నారు. హైదరాబాద్ నగరంలో పద్మశాలీ భవనం నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్ధలం, రూ. 5 కోట్ల నిధులు మంజురు చేస్తున్నట్టు సీఏం ప్రకటించారు. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, దీనికి మొదటి విరాళంగా టీఆర్‌ఏస్ పార్టీ నుంచి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. సంఘం ప్రముఖులు కూడా సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వాలని సీఏం పిలుపునిచ్చారు.
‘చేనేత వృత్తికి, ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకు గతంలో ఎంతో గౌరవం ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. 130 కోట్ల మంది ప్రజానీకానికి సరిపడా వస్త్రాలు చేనేత కార్మికులు నేయలేరు. మరమగ్గాలు, మిల్లులు వచ్చాయి. వాటితో చేనేత కార్మికులు పోటీ పడడం అసాధ్యం. దీని ఫలితంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. మరో పని చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. సమైక్య పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ ఏంపీగా ఉన్న నేను స్వయంగా పూనుకుని సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ. 50 లక్షల పార్టీ నిధులతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసాం. పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో టీఆర్‌ఏస్ పక్షాన జోలె పట్టుకుని చందాలు పోగు చేసి ఆదుకునే ప్రయత్నం చేసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చేనేత కార్మికులకు కొంతమైరకైనా ఆదుకోవచ్చని ఆనాడే అనుకున్నాం. అనుకున్నట్టే తెలంగాణ వచ్చింది. రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నాం’ అని సీఏం వివరించారు.
చిత్రం..ప్రగతి భవన్‌లో శుక్రవారం పద్మశాలి సంఘం ప్రతినిధులతో సమావేశమయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు