తెలంగాణ

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త పంచాయతీలు: జూపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 10: పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రంలో కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం సర్జాఖాన్‌పేట, బోగారం గ్రామంలో రైతుభీమా పథకం బాండ్ల పంపిణీ, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఏం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారన్నారు. గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4వేలకుపైగా కొత్త గ్రామ పంచాయతీలను, మరో 50మున్సీపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.