తెలంగాణ

సమగ్ర సర్వేలో తప్పులు సవరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 10: సమగ్ర సర్వేలో కొందరు తప్పుడు వివరాలు అందించి నష్టపోతున్నారని, వాటిని సవరించే ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామం చంద్రంపేటలో రైతులకు రైతు బీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ గతంలో సమగ్ర సర్వే వివరాల సేకరణలో ఎలాంటి తప్పిదాలు ప్రభుత్వం నుండి జరుగలేదని, కొందరు కావాలనే తప్పుడు వివరాలు అందించి, ఇపుడు ఇబ్బందులకు, నష్టాలకు గురవుతున్నారని అన్నారు. అందుకే సమగ్ర సర్వేలో దొర్లిన ఇలాంటి తప్పుడు వివరాలను సవరించే యోచన చేస్తున్నామని వెల్లడించారు. రైతన్నల వ్యవసాయ ఉత్పత్తులను గతంలో 4 లక్షల టన్నుల సామర్థ్యం గల వ్యవసాయ గోదాములుండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు రెట్లు పెంచి 24 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచామని మంత్రి అన్నారు. ఇన్ని రెట్లు పెంచిన ముఖ్య మంత్రి కేసీ ఆర్ ఇంకా పెంచాలనే యోచనలో ఉన్నారన్నారు. రూ.1000 కోట్లతో మరింత ఎక్కువ నిలువ సామర్థ్యంను పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయంను పండగగా మార్చాలని ముఖ్య మంత్రి అనేక కార్యక్రమాలు రైతు శ్రేయస్సు కోసం చేపట్టారన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు చూసి దేశం నివ్వెర పోతుందన్నారు. వ్యవసాయ ప్రముఖ శాస్తవ్రేత్త స్వామినాథన్, కేంద్ర ఆర్థిక సలహాదారు అరవివంద సుబ్రమణ్యం వంటి వారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలను దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రవేశపెడితే బాగుంటందని అభిపాయ పడుతున్నారని అన్నారు. రైతుకు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆ రైతు కుటుంబం మొత్తం వీధిన పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాంటి దుస్థితులను దూరం చేందుకు ముఖ్య మంత్రి రైతు బీమాకు శ్రీకారం చుట్టారన్నారు. రైతుకు నయాపైసా ఖర్చు లేకుండా రూ.2,271 ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఏ కారణంతో రైతు మరణించినా ఆ రైతు కుటుంబానికి 10 రోజుల్లోగా రూ.5 లక్షల ఎల్ ఐసీ చెక్కు వస్తుందన్నారు. దీని వల్ల రైతులకు దీమా పెరిగిందన్నారు. రాష్ట్రంలోని 58 లక్షల రైతు కుటుంబాలకు 12 వేల కోట్ల రూపాయలకు రూతు బంధు పథకం కింద రైతులకు పంట సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానే అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తీవ్ర విద్యుత్ కొరత ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ మిగుల రాష్ట్రంగా ఎదిగిందన్నారు. ప్రస్తుతం రైతన్నలక కడుపు నిండా నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నామని, అలాగే 38 లక్షల రైతు కుటుంబాలకు నాలుగు కిస్తులలో 17 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశామన్నారు. ఎరువులు, విత్తనాలు సమయానికి రైతన్నకు అందుబాటులో ఉంటున్నాయన్నారు. నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ, గుండా యాక్టు ప్రయోగిస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణ రాష్ట్రంలో రూ.200 పించన్లు 29 లక్షల మందికి ఏటా రూ.800 కోట్లు ఇస్తుంటే ప్రసుత్తం రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల నుండి రూ.1500 కోట్లకు పెన్షన్లు 42లక్షల మందికి ఏటారూ.5,600 కోట్లు ఇస్తున్నామన్నారు. రేషన్ బియ్యం, సన్న బియ్యంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. ఇళ్ళు కట్ట చూడు.. పెళ్ళి చేసిచూడు అనే నానుడి మనకు తెలిసిందేనని, ఇళ్ళు నిర్మాణం, పెళ్ళి చేసే సమయంలో పేదలకు ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రభుత్వమే రెండు పడకలగదలు ఇళ్ళు నిర్మిస్తుందన్నారు. ఆగస్టు 15 కల్లా గ్రామాలకు బల్క్ నీరు, దసరా కల్లా నల్లా ద్వారా ఇంటింటికి తాగునీరును మిషన్ భగీరథ ద్వారా అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో ఇటీవల విలీనమైన గ్రామాలలో పన్నులు వచ్చేమూడు ఏళ్ళ పాటు పెంచబోమని మంత్రి కేటీ ఆర్ ప్రకటించారు. వౌళిక సదుపాయాలను ఘననీయంగా పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, జిల్లా రైతు సమన్వయ సమితి సమన్వయకర్త గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకయ్య, ఆర్వో రేణ, ఎంపీపీ శ్రీలత, మున్సిపల్ కమీషనర్ రమణాచారి, డీఏవో రణదీర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్