తెలంగాణ

రైతు సంక్షేమం కోసం దేనికైనా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, ఆగస్టు 10: గత పాలకుల కంటే ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరును ప్రజలు హర్షిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలోనూ ముందుండడాన్ని దేశమే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని సిద్దన్నపేట మార్కెట్ యార్డులో రైతులకు బీమా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం దేనికైనా సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. బీమాతో రైతులకు ధీమా వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు కొండంత ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసం, భరోసాను ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో రైతులకు ఏ సమస్య వచ్చినా అధికారుల చుట్టూ తిరిగే వారని ప్రస్తుతం టీఆర్‌ఎస్ పాలన రైతుల చుట్టూ తిరుగుతున్నదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడుగని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, అందులో భాగంగా రైతు బంధు, రైతుకు బీమా సౌకర్యం కల్పించామని అన్నారు. యాసంగిలో ప్రభుత్వం మొక్కజొన్నలకు, కందులకు 1400 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని తెలిపారు. కోట్లాది రూపాయలు రైతుల కోసం భరిస్తున్నదని అన్నారు. రైతన్న సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పని చేస్తున్నదని, ఇందు కోసం ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగుతుందని హరీశ్ అన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎరువులు, విత్తనాలు కోసం చెప్పులు అరిగేలా రైతులు తిరిగేవాళ్లని, ఆనాడు కరెంటు పరిస్థితి రైతులందరికీ తెలుసనని అన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రైతులు ఆనాడు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు పట్టించుకోలేని ప్రస్తుతం రైతుల కష్టాలను గ్రహించిన కేసీఆర్ అడుగకుండానే సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. వానలు లేక రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి నెలకొందని దీనిపై ఆలోచించిన సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేండ్లలో పూర్తి చేసి రైతులకు సాగు నీరందించ నున్నారని తెలిపారు. రైతుకు పంట బీమా కింద 750 కోట్లు మంజూరైతే రాష్ట్ర వాటాకింద 270 కోట్లు చెల్లించిందన్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తే కాలంతో పనిలేదని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌ను చేసిన సేవలను కొనియాడారు.

చిత్రం..రైతులకు బీమా పత్రాలను అందిస్తున్న మంత్రి హరీశ్‌రావు