తెలంగాణ

సర్పపూజకు ఉద్దిష్టమైనది నాగుల పంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఆగస్టు 10: శ్రావణ శుక్ల పక్ష పంచమిని ‘‘నాగ పంచమి’’ లేదా ‘‘నాగుల పంచమి’’గా పిలుస్తారు. ఇది సర్పపూజకు ఉద్దిష్టమైన దినం. నాగులకు, ఆంధ్రులకు ప్రాచీన కాలమునుండి విశేష సంబంధముంది. భారతావనిలో అనేక ప్రదేశాలలో నాగజాతి వారున్నట్లు చరిత్ర చెపుతున్నది. కాశ్మీర రాజులు తాము కర్కోటక నాగరాజు సంతతి వారమని చెప్పుకునే వారు. నాగపూరు రాజన్యులు తాము పుండరీక నాగరాజు సంతతికి చెందిన వారమని ప్రకటించుకునే వారు. ఆంధ్రులూ నాగజాతి వారనే వాదన కూడా లేకపోలేదు. బౌద్ధ ధర్మమంటే నాగులకు ఆనురక్తి ఉన్నట్లు, బుద్ధునికి పరమ భక్తులై నాగులు బౌద్ధాన్ని ఆదరించి, అవలంబించారని బౌద్ధ వాజ్మయంలో అనేక గాథలు తెలుపుతున్నాయి. ఏలాపత్ర నాగుడు, ముచిలింద నాగుడు మొదలైన వారు బౌద్ధ గాథలలో ప్రసిద్ధులు. దిక్కులను పాలించే లోకపాలకులకు, నాగులకు సంబంధమున్నట్లు బౌద్ధుల విశ్వాసం. శివుడు పార్వతికి నాగ పంచమి పర్వాన్ని గురించి చెప్పినట్లు పురాణ కథనం. అమరావతి, నాగార్జున కొండతో పాటు అవిభక్త కరీంనగర్ జిల్లాలోని ప్రాచీనమైన ధూళికట్ట తదితర ప్రాంతాలలో బౌద్ధ శిల్పాలలో నాగరాజుల, నాగిమల చిత్రాలున్నాయి. ప్రాచీనాంధ్రులు నాగులను కటి ప్రదేశం నుండి పైభాగమంతా మనిషి రూపంలో, క్రింది భాగమంతా సర్పరూపాలలో చెక్కారు. నాగరాజు చిత్రాలకు తలపైన ఐదు పడగలుంటాయి. నాగినికి ఒక్కటే పడగ. భారతావనిలో నాగపూజ ఆదినుండీ ఆచరణలోఉంది. గౌతముడు తన గృహ్య సూత్రాలలో పేర్కొనగా, యజ్ఞ మంత్రాలలో నాగుల స్తుతి పేర్కొనబడింది. నాగశిలలు, నాగ కల్లులూ, ప్రతిమలు ప్రతి చోట దర్శనమిస్తాయి. పుట్టిన బిడ్డలు చనిపోతుంటే సంతానం నిలవడానికి నాగ ప్రతిష్ఠలు చేయడం ఆరాధించడం ఆచారంగా ఉంది. ఆదినుండీ ఆంధ్రులు, నాగారాధకులుగా ఉన్నారు. ఆది శేషుడు భూభారాన్ని నిర్వహించడానికి, తమకు సేవ చేయడాన్ని మెచ్చిన విష్ణుమూర్తి, వరం కోరుకొమ్మనగా, తనను పంచమినాడు పూజించే వరమీయమని శేషుడు కోరుకున్నట్లు, విష్ణువు అట్లే వరమిచ్చి, పంచమి నాటి పూజ వల్ల సర్ప భయముండనట్లు వరమిచ్చినట్లు పురాణాధారం. పర్వదినం నాడు ఇంటి గడపలకు ఇరు పక్కలా గోమయంతో నాగుల మూర్తులు ప్రతిష్ఠించి, 12ఏళ్ళు విడవకుండా వ్రతాన్ని ఆచరిస్తే గొప్ప పుణ్యం. ఐదు తలల పాములను వెండితో గాని, మట్టితోనైనా చేసి పూజించడం ఆచారం. చెవిలో చీము పట్టినా, వినపడక పోయినా, చెవులను బంగారు, వెండితో చేయించి శివాలయాలకు సమర్పించడం పరిపాటిగా ఉంది. నాగపంచమినాడు బతికి ఉన్న పామును చూస్తేఅదృష్టమని భక్తుల విశ్వాసం. అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, కర్కోటక, అశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళి అని 12రకాల సర్పాలను ఒకొక్క నెలలో పూజించడం ప్రాచీన సాంప్రదాయంగా ఉండేది. ప్రపంచంలో శాస్తవ్రేత్తలకు తెలిసిన దాదాపు అన్ని రకాల పాములున్న దేశం భారత దేశమే. తమిళులు శ్రావణ శుద్ధ పంచమి నాడే నాగపూజలు చేస్తారు. కాశీలో శేషుని అవతారంగా భావించే పతంజలిని ఈరోజే పూజిస్తారు. వంగదేశంలో నాగరాజైన వాసుకి సోదరి ’మనసాదేవి’ లేదా విషహరి పూజ జరుగుతుంది. మానవుని మానసిక శక్తికి హిందూదేశంలో పాము చిహ్నంగా ఉంది. మానసిక శక్తికి వేదాంత పరిభాషలో కుండలినీ శక్తి అని పేరు. నిస్సంగుల తపస్సు అంతా ఈ కుండలినీ శక్తిని లేపుటకే. కుండలినీ శక్తిని గ్రీకు భాషలో ‘‘స్పీరిమా’’ అంటారు. స్పీరిమా అంటే సర్పవలయం. కుండలిని సర్పంటైన్‌గా పిలుస్తారు. మూలాధారం నుండి సహస్రారము వరకు వెనె్నముక మధ్యనుండి సర్పాకారముగ కుండలినీ శక్తి అనబడు సుషుమ్నా నాడిని లేవజూపడమే నాగపూజ ప్రధానోద్దేశమని విజ్ఞుల భావన.