తెలంగాణ

ఉప్పొంగిన జాతీయ భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 10: కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో నిర్వహించిన మెగా ఫ్రీడమ్ 4కే రన్‌కు భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డితో పాటు సుమారు 20వేల మంది ఈ రన్‌లో పాలుపంచుకున్నారు. రన్ సందర్భంగా ప్రదర్శించిన 100 మీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిం ది. మిలటరీ అధికారులు, ఎన్‌సీసీ కెడెట్లు, స్కౌట్ అండ్ గైడ్స్‌లు ఈ జాతీయ జెండాను పట్టుకుని రన్‌లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ రన్ ఎస్సారార్ ప్రభుత్వ డీగ్రీ కళాశాల వరకు కొనసాగింది. ఎస్సారార్ కళాశాల ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమంలో కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తి, నేర రహిత సమా జం నిర్మాణం కోసం పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు ముందుకువచ్చి దేశాభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. కమిషనర్ కమలాసన్‌రెడ్డి మా ట్లాడుతూ అమర జవాన్లను స్మరిస్తూ, వారి ఆశయ సాధన కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.

చిత్రం..వంద మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న దృశ్యం