తెలంగాణ

మా భూములను కబ్జా చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఆగస్టు 20: తమ భూములను ఇతరులు అక్రమించుకున్నారని ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించడం లేదని విసుగు చెం దిన ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వైనం వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి జరుగుతుండగా వంటిపై కిరోసిన్ పోసుకొని వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గోపాల్‌పేట మండల కేంద్రానికి చెందిన కే. చెన్నమ్మ తన తండ్రి బుచ్చన్నకు మాజీ ప్రధాని ఇందిరగాంధీ పాలనలో సర్వే నెంబర్ 772లో ఎకరా 30 గుంటల భూమిని భూ పంపిణీ కింద ఇచ్చారని అప్పటి నుంచి ఆ భూమిని తాము సాగుచేస్తుండగా గత నాలుగు నెలల క్రితం శిశధర్, రాంచంద్రయ్య అనే ఇద్దరు వ్యక్తులు కలిసి తనను భూమి నుంచి వెళ్లగొట్టారని ఆమె వాపో యంది. మండలంలో తహశీల్దార్, వీఆర్వోలుకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడంపై జూన్‌లో భూ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం ప్రజావాణికి వచ్చిన ఆమె తన సమస్య పరిష్కారం కావడం లేదని అవేదనకు గురై కలెక్టరేట్ భవనంపైకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకోగా అది గమనించిన పోలీసులు హుటాహుటిన పైకి వెళ్ళి మహిళా రైతును అదుపులోకి తీసుకొని కలెక్టర్ శే్వతామహంతి ముందు హాజరుపరిచారు. ల్యాండ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినందుకు కమిషనర్‌కు తాము వివరణ ఇచ్చామని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని చెన్నమ్మకు కలెక్టర్ నచ్చజెప్పారు. అలాగే, వీపనగండ్ల గ్రామానికి చెందిన పస్పుల బాలమ్మ భర్త బాలస్వామికి చెందిన సర్వే నెంబర్ 159లో ఎకరా 35 గుంటల భూమిని గ్రామానికి చెందిన గొల్ల మధుగని నర్సింహ్మకు కౌలుకు ఇవ్వడంతో ఇటివల ఆ భూమిని అక్రమించుకొని ఓ ఆర్సి తెచ్చుకున్నారని, ఈ విషయంపై పలుమార్లు ప్రజావాణిలో విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదనే అవేదనతో భార్య బాలమ్మతో కలిసి సోమవారం ప్రజావాణికి వచ్చిన బాలస్వామి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. పోలీసులు అతని వారించి బయటకు పంపారు.

చిత్రం..ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన చెన్నమ్మను వారిస్తున్న పోలీసులు