తెలంగాణ

సాగర్ క్రస్ట్‌గేట్లను తాకిన కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 20: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న కృష్ణా వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రాత్రి కల్లా సాగర్ జలాశయం నీటి మట్టం 547 అడుగులకు, 201 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ఐదుగేట్ల నుంచి విడుదలవుతున్న వరద నీరు గార్జున సాగర్‌కు 2లక్షల 8వేల 554 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా సాగర్ నుంచి కుడి కాలువకు 7,578 అడుగులు, పవర్ హౌస్ ద్వారా 12,425 క్యూసెక్కులు,, ఎస్‌ఎల్‌బిసికి 1650 క్యూసెక్కులు అవుట్ ఫ్లోగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన తుంగభద్ర, జూరాల నుంచి 1లక్ష 63,497 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 882.30 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి నిలకడగా వరద ఉద్ధృతి శ్రీశైలంకు వస్తుండటంతో శ్రీశైలం నుంచి మరో నాలుగైదు రోజులు సాగర్‌కు ఇదే రీతిలో ఇన్‌ఫ్లో కొనసాగిన పక్షంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలకు చేరువ కానుంది. కాగా సాగర్ ఎడమకాలువ కింద ప్రస్తుత వానాకాలం, రానున్న యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై రైతు సంఘాలతో సోమవారం మిర్యాలగూడలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సమావేశమయ్యారు. ఈ నెల 22నుంచి ఎడమకాలువకు నీటి విడుదల చేయనున్నందున ఆయకట్టులోని 3లక్షల 80వేల 431ఎకరాలకు వానాకాల పంటకు సక్రమంగా సాగునీరందించేందుకు, ఆయకట్టు చివరి భూముల వరకు నీరు చేరేలా చూడాలని నిర్ణయించారు.
జూరాలకు స్వల్పంగా తగ్గిన వరద
గద్వాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి ఉద్ధృతి సోమవారం సాయంత్రానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం జూరాల జలాశయంలో 318.300 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1,18,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 11 గేట్లను తెరచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల కుడి, ఎడమ కాలువలు, సమాంతర కాలువ, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు జూరాల నుంచి 1,07,124 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయంలో 124.92 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1,28,438 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 1,25,569 క్యూసెక్కులను విడదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 36.54 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1,21,364 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 1,12,358 క్యూసెక్కులను వదులుతున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జూరాలకు వస్తున్న వరద నీటి ఉద్ధృతిని తెలుసుకొని జూరాల ఎగువ, దిగువ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో 10 యూనిట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.
శ్రీశైలానికిసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ పరీవాహక ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహం ప్రారంభంలో మూడు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా క్రమేపీ తగ్గుతూ సోమవారం సాయంత్రానికి 153497 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి ఐదు స్పిల్వే గేట్ల ద్వారా 134180 క్యూసెక్కుల నీటిని దిగువ నాగర్జున సాగర్‌కు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి డ్యాం గేట్ల ద్వారా 60620 క్యూసెక్కులు పవర్‌హౌస్ ద్వారా 43వేల క్యూసెక్కులు, సుంకేశుల ద్వారా 49868 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. శ్రీశైలం డ్యాం తెలంగాణ ప్రాంత భూగర్భ పవర్‌హౌస్ ద్వారా ఒక్కొక్కటి 150మెగా వాట్ల విద్యుత్‌ను ఆరు యూనిట్ల ద్వారా మొత్తం 900మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 42378 క్యూసెకుక్కుల నీటిని, కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో ఒక్కోక్కటి 110 మెగావాట్లకు ఏడు యూనిట్లు మొత్తం 770 మెగావాట్ల విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూ దిగువన నాగర్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. గడచిన 24గంటలలో భూగర్భ పవర్‌హౌస్ 21.55 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను, కుడిగట్టు విద్యుత్ కేంద్రం 16.60 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ మొత్తం 38.15 మిలియన్ యూనిట్లను గ్రిడ్‌కు అందిస్తున్నారు. రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 2400 క్యూసెక్కులు, హంద్రీ-నీవా లిఫ్ట్ ఇరిగేషన్‌కు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా 26వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి రిజర్వాయర్‌లో గరిష్ట నీటి మట్టం 88 అడుగులకు గాను 882 అడుగులుగా, గరిష్ట నీటి నిల్వ 215.8టీ ఎంసీలకు గాను 200.6558 టీఎంసీలుగా నమోదై ఉన్నాయి.
చిత్రాలు..సాగర్ క్రస్ట్‌గేట్లను తాకుతున్న కృష్ణా జలాలు
* జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న వరద నీరు