తెలంగాణ

మత్స్యకారులకు ప్రమాద పరిహారాన్ని పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణలో మత్స్యకారులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రమాద పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచాలని, అన్యాక్రాంతమైన అటవీ భూములను స్వాధీనం చేసుకొని వాటి పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం నగరంలోని ఆ సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి సంఘం నూతన అధ్యక్షుడు పుట్టి యాదగిరి ముదిరాజ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘం కార్యవర్గం పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించింది. ముదిరాజ్‌లను బిసి ‘డి’ గ్రూపు నుంచి బిసి ‘ఎ’ గ్రూపులోకి ఆర్డినెన్స్ ద్వారా మార్చాలంటూ ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయాలని, చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్య కార్మికులకు సుంకం వేయరాదని, అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ ముదిరాజ్ కులస్థులకు కుటుంబానికి ఐదెకరాల భూమి ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. ముదిరాజ్ కులస్థులకు ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటు చేసి 500కోట్లు కేటాయించాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం పథకంలో ముదిరాజ్‌లకు ప్రాధాన్యతనివ్వాలని సంఘం డిమాం డ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుట్టి యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.