తెలంగాణ

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువతి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కెపిహెచ్‌బి, మే 28: హైదరాబాద్‌కు చెందిన రమ్యకృష్ణ అనే యువతి వారం రోజుల క్రితం ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రమ్యకృష్ణ మృతదేహాన్ని భర్త మహంత్, కుటుంబీకులు శుక్రవారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో మృతదేహాన్ని రమ్యకృష్ణ బంధువులకు అప్పగించి వెంటనే పరారయ్యాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసుల సహకారంతో రమ్యకృష్ణ మృతదేహాన్ని కూకట్‌పల్లిలోని ఆమె నివాసానికి తరలించారు. కాగా, తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన నార్ల సుబ్రహ్మణ్యం కుమారుడు మహంత్‌తో పూర్ణచంద్రరావు కుమార్తె రమ్యకృష్ణకు 2014లో వివాహమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడి వ్యాపారం చేసుకుంటున్న మహంత్ భార్యను మొదట్లో బాగానే చూసుకున్నాడు. అయితే సంవత్సర కాలం నుంచి రమ్యకృష్ణకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీనికి తోడు మహంత్ తల్లి రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా వెళ్లడంతో ఆమెకు వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ నెల 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు రమ్యకృష్ణ తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడింది. అదే రోజు మధ్యాహ్నం రమ్య మృతి చెందిందన్న సమాచారం వచ్చింది. ఉదయం మాట్లాడిన తమ కుమార్తె మధ్యాహ్నం ఎలా చనిపోయిందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక అనుమానాలతో ఆస్ట్రేలియా వెళ్లిన వారు నానా ఇబ్బందులు పడి మృతదేహంతో హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన అనంతరం మహంత్ ఓ బ్యాగులో వున్న రమ్యకృష్ణ పాస్‌పోర్టు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడని, ఆస్ట్రేలియాలో రమ్య పేరిట రూ.2.5కోట్ల బీమా ఉందని, డబ్బు కోసమే మహంత్ తమ కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని రమ్యకృష్ణ తల్లిదండ్రులు ఆరోపించారు. మహంత్ వ్యాపారం సరిగా లేకపోవడంతో ఆయనకు కొంత నగదును కూడా అందజేశామని వారు చెప్పారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో రమ్య కుటుంబీకులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూకట్‌పల్లి ఇనె్స్పక్టర్ కుషల్కర్ వివరించారు. రమ్య మృతితో సంబంధం లేదు: నార్ల
ఇదిలావుంటే, రమ్యకృష్ణ మృతితో తమకెలాంటి సంబంధం లేదని మహంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని, రమ్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో అన్ని రకాలుగా విచారణ జరిపామని, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు జరగలేదన్నారు. అయితే డబ్బు కోసమే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్య అంటున్నారని రమ్య తండ్రి పూర్ణచంద్రరావు ఆరోపించారు. కాగా రమ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
కేసు వద్దు.. ఇంతటితో వదిలేద్దాం: పూర్ణచంద్రరావు
రమ్య మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించగా, కేసు వద్దు.. ఈ విషయాన్ని ఇంతటితోనే వదిలేద్దామని రమ్య బంధువులు తెలిపారు. ఇప్పటికే పరువు పోయింది, ఇంకా ఎందుకు పరువు తీసుకోవాలి? ఒక వేళ తమ కుమార్తెపై మహంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఏవైనా ఆరోపణలు చేస్తే అప్పుడు కేసు పెడతామని రమ్య తండ్రి పూర్ణచంద్రరావు వివరించారు.

మహంత్, రమ్యకృష్ణ
(పెళ్లినాటి ఫైల్‌ఫొటో)