రాష్ట్రీయం

ఏటా ప్రోగ్రెస్ రిపోర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: తమ పాలనపై ప్రతి ఏటా ప్రోగ్రెస్ రిపోర్ట్‌తో ప్రజల ముందుకు వస్తామని, అదే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లకొకసారి మాత్రమే ప్రజల ముందుకు వెళ్లేదని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నేతలంతా 10 జన్‌పథ్ చుట్టూనే తిరిగేవారని ఆయన విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన యుపిఎ పాలనకు, ఇప్పటి ఎన్డీయే పాలనకు పోలికే లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళ పాలనపై బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా అమిత్ షా ఆదివారం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగిస్తూ కార్యకర్తలను ఉర్రూతలూగించారు. తెలంగాణ అసెంబ్లీకి 2019లో జరగబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చే బాధ్యత పార్టీ కార్యకర్తల భుజస్కందాలపైనే ఉందని అమిత్ షా అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలూ కష్టపడి పని చేస్తే తెలంగాణలో అధికారంలోకి రానీయకుండా ఎవరూ ఆపలేరని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తారా? అని ప్రశ్నించడంతో సభికులు తప్పకుండా తెస్తాం అని సమాధానమిచ్చారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపడతారా? అని ప్రశ్నించగా, చేస్తాం..అంటూ నినాదాలు చేశారు. 2019 ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ గడువు ఉందని, అంటే సుమారు వెయ్యి రోజులు ఉన్నాయని ఆయన తెలిపారు. వెయ్యి రోజులు అంటే మామూలు విషయమే కాదని అన్నారు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్క కార్యకర్త ప్రణాళికాబద్ధంగా కష్టపడి పని చేస్తే అధికారంలోకి రానీయకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. రెండేళ్ళలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా 200 కేంద్రాల్లో వికాస్ పర్వ్ పేరిట జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రైతు సమ్మేళనాలు చేపడుతూ ప్రతి ఒక్క గ్రామానికీ వెళ్లాలని ఆయన సూచించారు. రెండేళ్ళలో చేసింది ఏమిటీ? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం విస్మయం కలిగిస్తున్నదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం వారికి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. పదేళ్ళ యుపిఎ ప్రభుత్వ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శించారు. 2జి స్పెక్ట్రమ్ నుంచి మొదలుకుని ఆకాశంలో, భూమిలో, చివరకు పాతాళలోకంలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ టూరిస్ట్ ప్రధానిగా మారారని కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన విమర్శను ఆయన ప్రస్తావిస్తూ మోదీ కంటే కూడా నాడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు విదేశీ పర్యటనలు గుట్టుచప్పుడు కాకుండా చేశారని, పైగా మలేసియాలో చెప్పాల్సింది థాయ్‌లాండ్‌లో చెప్పడం వంటివి చేశారని ఆయన సభికులను నవ్వించారు. ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్ళినా ఘనస్వాగతం లభిస్తున్నదని అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అమిత్ షా వివరించారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు, మహిళలకు చేపట్టిన పథకాల గురించి, గ్రామ సడక్ యోజన, జన్‌థన్ వంటి కార్యక్రమాల గురించి వివరించారు.
కేంద్ర సహకారం..: దత్తాత్రేయ
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ తెలంగాణలో 2019 ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని, అందుకు కార్యకర్తలు కష్టపడాలని అన్నారు. బిజెపి శాసనసభాపక్షం నాయకునిగా ఎన్నికైన జి. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ రజాకార్ల పార్టీ మజ్లిస్ ఉండేందుకు వీలులేదని అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మజ్లిస్‌పై ముఖ్యమంత్రి వైఖరేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ సభలో బిజెపి జాతీయ నాయకుడు రాంలాల్ తదితరులు ప్రసంగించారు.
ఉరకలేసిన ఉత్సాహం..
ఇలాఉండగా బిజెపి సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాలు నిండిపోవడంతో తలుపులు మూసి వేశారు. దీంతో చాలా మంది హాలు వెలుపల ఎల్‌సిడిల ద్వారా సభను వీక్షించారు. వేదికపై పార్టీ నాయకులు కొందరు అమిత్ షాతో ధనస్సు, బాణం పట్టించారు. సభ విజయవంతం అయినందుకు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
chitram..
బిజెపి శ్రేణుల సభలో బాణాన్ని ఎక్కుపెట్టిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా