ఆంధ్రప్రదేశ్‌

పుట్టిందే తెలంగాణలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 29: తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు చివరిరోజైన ఆదివారంనాడు పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్ర సిఎం చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్, పార్టీ తెలంగాణ నేతలు తెలంగాణరాష్ట్ర సమితిపైనా, తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావుపైనా నిప్పులు చెరిగారు. ముగింపు ప్రసంగం చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్, ఇటు వై ఎస్సార్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కానీ, తెలంగాణ రాష్ట్ర సమితిని కానీ, కెసి ఆర్‌ను కానీ పల్లెత్తు మాట అనకపోవటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రా పార్టీ అంటూ టిఆర్‌ఎస్ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారని.. కానీ టిడిపి తెలంగాణలో పుట్టిన పార్టీ అన్నది తెరాస నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలని లోకేష్ అన్నారు. ఆదివారం మహానాడు వేదికపై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన టిఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రకటించారని ఆయన వివరించారు. తెలంగాణ సి ఎం కె.చంద్రశేఖర్ రావు సహా తెలంగాణ రాష్ట్ర సమితిలోని అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను తెరాస..తమ పార్టీలోకి లాక్కుంటూ, పార్టీలో కొనసాగుతున్న వారిని నానా ఇబ్బందులకు గురి చేయటం దారుణమని లోకేష్ వ్యాఖ్యానించారు. టిడిపి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని.. మొన్నటి జిహెచ్ ఎంసి ఎన్నికల్లో హైదరాబాద్‌లో తెరాస తరువాత తెలుగుదేశం పార్టీకే అత్యధిక ఓట్లు పోలయ్యాయని ఆయన పేర్కొన్నారు. 2019 తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.
టిడిపితో గోక్కోవద్దు... కనుమరుగైపోతావ్
టిడిపితో గోక్కుంటే కనుమరుగైపోతారని తెలంగాణ టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహానాడులో టిఆర్‌ఎస్ హామీలు-వైఫల్యాలపై రేవంత్ రెడ్డి పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. టి ఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలపైన నిప్పులు చెరగడంతో పాటు కాకుండా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది టిడిపి ఒక్కటేనన్నారు. 2019లో మిషన్-99తో తెలంగాణలో 99 సీట్లు సాధించి టిడిపికి తిరుగులేని విజయం అందిస్తామని తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చి కుటుంబపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 3.60లక్షల కోట్ల రూపాయలతో పథకాలు పెట్టారని, 2.50లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారని ఎవరికి ఖర్చు చేశారు? ఎంతమంది పేదలకు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. కె సి ఆర్ బంగారుతెలంగాణ అని చెబుతున్నాడని, వారింటిలో పోగేసిన బంగారును చూపించి ఇదే బంగారు తెలంగాణ అని చెబుతాడేమోనని ఆయన ఎద్దేవా చేశారు. తమను నాయకులను చేసిన టిడిపిని వదలి కె సి ఆర్ పంచన చేరినవారు ఆత్మ గౌరవాన్ని చంపుకుని బతుకుతున్నారని అన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి టి ఆర్ ఎస్‌లో చేరిన టిడీపీ నేతలను ఉద్దేశించి ఒకటి రెండు పిట్టకథలను ఆసక్తికరంగా వినిపించారు. రేవంత్‌రెడ్డి పిట్టకథలు చెప్తున్న సమయంలో చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబు పక్కన కూచున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఖమ్మం టిఆర్‌ఎస్ ప్లీనరీలో ఎనిమిదో వరుసలో కూచోవలసి వచ్చిందన్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు వాణిజ్యపన్నుల శాఖను తలసానికి అప్పగించిన కెసిఆర్, ఎన్నికల తరువాత నాలుగు బర్రెలను తోలుకోమంటూ పశుసంవర్థక శాఖను కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌కు తన కుటుంబ సభ్యులపై కూడా నమ్మకం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి చేసిన తీర్మానాలను వీరేంద్రగౌడ్ బలపరిచారు. టిడిపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, అరవిందకుమార్‌గౌడ్‌లు కూడా తెరాస పాలనపై నిప్పులు చెరిగారు.