తెలంగాణ

జగ్గారెడ్డి అరెస్టుతో వెల్లువెత్తిన నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 11: మనుషుల అక్రమ రవాణా ఆరోపణలపై ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని నగరంలోని ఉత్తర మండలం పోలీసులు అరెస్టు చేయడంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం రాత్రి పొద్దుపోయాక పటన్‌చెరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్త నియోజకవర్గంలో వ్యాపించింది. ఈ మేరకు ఉదయమే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలకు దిగారు. ముందస్తుగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి బందోబస్తును పరిశీలించారు. జగ్గారెడ్డి ఇల్లు, పాత బస్టాండ్‌తో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించారు. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సదాశివపేట మున్సిపల్ పట్టణంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తం నియోజకవర్గం బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మధ్యాహ్నం సంగారెడ్డిలో నిర్వహించే నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహను మార్గమధ్యలో పటన్‌చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అడ్డగించిన పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికే జగ్గారెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునితా లక్ష్మారెడ్డికి దామోదర్‌ను అరెస్టు చేసిన విషయం తెలియడంతో పార్టీ శ్రేణులతో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడే బందోబస్తు చేస్తున్న పోలీసులు ఆందోళనకారులను రోడ్డుపైకి రానీయకుండా అడ్డుకున్నారు. సునితారెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న విషయాన్ని అధికార టీఆర్‌ఎస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని డీసీసీ అధ్యక్షురాలు సునితారెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కే చెల్లిందని ఆరోపించారు. సంగారెడ్డిలో మైనార్టీలతో సభను నిర్వహించకుండా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారానికి తెరలేపారని విమర్శించారు.

చిత్రాలు.. .. పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులు
* (ఇన్‌సెట్‌లో )సునితారెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు