తెలంగాణ

ధన అహంకారంతోనే ప్రణయ్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 17: ధన, అహంకారంతో పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్‌ను హత్య చేశారని, సమగ్ర విచారణకు ప్రభుత్వానికి, పోలీసులకు కాంగ్రెస్ సహకరిస్తుందని సీఎల్‌పీ మాజీ నేత, మాజీ హోంమంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ప్రేమ పెళ్లి చేసుకుని హత్యకు గురైన ప్రణయ్‌కుమార్ ఇంటిని సోమవారం ఆయన సందర్శించారు. ప్రణయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ హత్యలో, కుట్రలో ఎవరున్నా క్షమించరానిదన్నారు. చట్టబద్ధంగా వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి సహకారమందిస్తుందన్నారు. హత్య జరిగిన విషయం, అనంతరం ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి నిందితుల్లో ఒకరుగా ఉన్నారన్న విషయం తెలిసిన మూడు గంటల్లోనే మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి.కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించినట్టు తెలిపారు. ఇలాంటి హత్యల్లో ఇతర నేరాల్లో ఉండకూడదని నాయకులకు హితవు పలికారు. దేశం, రాష్ట్రం ఇతర ప్రాంతాల్లో ప్రేమ పెళ్లిళ్లను భగ్నం చేస్తూ హత్యలు, దాడులు జరుగుతున్నాయని మంచి పరిణామం కాదన్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారికి భద్రత కల్పించాలని, సమ సమాజ స్థాపనకై ప్రేమ పెళ్లిలు దోహదపడతాయన్నారు. అరాచకాలను అణచివేయడానికి తమ పార్టీ పోలీసులకు పూర్తి సహకారమందిస్తుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కే.శంకర్‌నాయక్, డి.స్కైలాబ్‌నాయక్ తదితరులున్నారు.

చిత్రం..ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సీఎల్‌పీ మాజీ నాయకుడు జానారెడ్డి