తెలంగాణ

ఇక... ‘తీన్’మార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాష్ట్రం ఏర్పడగానే అదీ ఇదీ అంటూ గాబరాపడి ఆగమాగమయ్యే ప్రభుత్వం కాదు మాది. ఉమ్మడిలో తెలంగాణకు ఎక్కడ అన్యాయం
జరిగింది, దాన్ని ఎలా
పూడ్చుకోవాలో లోతుగా అధ్యయనం చేస్తాం. మూలాలను తెలుసుకుని
క్షేత్రస్థాయి నుంచి చేపట్టాల్సిన
చర్యలతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలు పకడ్భందీగా రూపొందించిన తరువాతే ముందుకు సాగుతాం’

హైదరాబాద్, మే 30: అర్థ దశాబ్దానికి పైగా సాగిన ప్రత్యేక తెలంగాణ సాధనోద్యమ ఫలితానికి రెండు రోజుల్లో రెండేళ్లు పూర్తికాబోతోంది. ప్రత్యేక తెలంగాణ సాధించిన తెరాసకే పాలించే అధికారాన్నీ ప్రజలు కట్టబెట్టారు. రాష్ట్రావిర్భావంతో ఒనగూరిన ప్రయోజనాలు, ప్రజలు ఆశించిన ఫలాలు రెండేళ్లలో ఏమేరకు అందించామన్న విషయాన్ని తెరాస సర్కారు పునఃస్సమీక్షించుకుంటోంది. అలాగే రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వ పనితీరులో మంచి చెడ్డలనూ బేరీజు వేస్తోంది.
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో యావత్ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికైన ప్రజాప్రతినిధులను కలిపి ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించారు. సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా ఎలా తీర్చుదిద్దబోయేదీ ప్రజలముందు సిఎం కెసిఆర్ ఉంచిన దార్శనిక పత్రంగా ఆ ప్రకటనను పరిగణించొచ్చు.
తెరాస అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదంతా బాలారిష్టాలతోనే గడిచింది. రాష్ట్రానికి సరిపడా ఏఐఎస్‌ల కేటాయింపులు లేక, ఉద్యోగ విభజన జరుగక, కొత్త రాష్ట్రానికి ప్రత్యేక చట్టాల కరవు, ఉమ్మడి చట్టాలనే అన్వయించుకునే పరిస్థితి, చాలీచాలని అధికారులు, సిబ్బందితో సర్దుబాటు చేసుకోవడానికే సరిపోయింది. ఇక రెండో ఏడాది పాలనతో ప్రభుత్వానికి అన్నింటిపైనా స్పష్టత వచ్చింది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై స్పష్టమైన అవగాహనకు రావడానికి తొలి ఏడాదిలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలో 36.33 లక్షల రైతు కుటుంబాలకు రూ.17 వేల కోట్ల పంట రుణాలు, ఈ రెండేళ్లలో మరో 8 వేల కోట్లు మాఫీ చేసి మాట నిలబెట్టుకుంది. తెలంగాణ విడిపోతే చీకటి బతుకు తప్పదంటూ విద్యుత్‌పై సమైక్యవాదులు చేసిన వాదనను తిప్పికొట్టి, సమర్థమైన ప్రణాళికతో కోతలస్థానే కాంతులు అందించింది. నిరంతర విద్యుత్ సరఫరాతో ప్రభుత్వంపై సానుకూల సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలికృతమైంది. అలాగే మిషన్ కాకతీయ కింద కాకతీయుల కాలంనాటి చెరువుల పునరుద్ధరణకు నడుంబిగించి తొమ్మిదివేల చెరువులకు మరమ్మతులు చేపట్టింది. ఐదేళ్లల్లో 46.3వేల చెరువుల పునరుద్ధరణకు లక్ష్యం నిర్దేశించుకుంది. మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచి నీళ్లిచ్చే కార్యక్రమాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. ఈ ఏడాది చివరికి ఆరు వేల గ్రామాలకు, 12 పట్టణాలకు మంచినీళ్లు అందించబోతున్నట్టు ముందుగా ప్రకటించింది. 2017 చివరికల్లా రాష్ట్రంలో 95 శాతం గ్రామాలకు, పట్టణాలకు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకుంది. టిఎస్-ఐపాస్ కింద నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి కొత్తగా 1623 పరిశ్రమలకు అనుమతిచ్చింది. వీటివల్ల రాష్ట్రానికి 35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో ప్రభుత్వం కృషి ఫలించింది. సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేసి గోదావరి, కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయ, వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అయ్యే ఖర్చు, సంక్షేమ పథకాల అమలుపై రెండో ఏడాదికే ప్రభుత్వానికి స్పష్టత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో లక్ష 30 వేల కోట్లతో బడ్జెట్ రూపొందించుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి టాగ్‌లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలను ప్రాధాన్యతా అంశాలుగా ఎంచుకుంది. నిధులు, నీళ్లపై వ్యూహాలతో ముందుకు వెళ్లగలిగింది. ఇక మిగిలిన నియామకాల కోసం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది టిఎస్‌పిఎస్‌సి ద్వారా 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారానే కాకుండా 15వేల ఉపాధ్యాయ పోస్టులు, 9వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి విధిగా చర్యలు చేపట్టింది. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 470 కుటుంబాలకు పంపిణీ చేసింది. అలాగే వీరి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగమిస్తూ నియామక పత్రాలను రాష్ట్రావిర్భావ వేదికపై అందజేయబోతుంది. కాంట్రాక్టు ఉద్యోగులు 18 వేలమంది సర్వీసులను క్రమబద్ధీకరించి వారికీ కూడా నియామక పత్రాలను ఇదే వేదికపై లాంఛనప్రాయంగా అందజేయనుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి నుంచే వేతనాలు పెంచింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీమేరకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.6500 కోట్ల భారమైనప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కళ్యాణలక్ష్మి పథకం ఎన్నికల ప్రణాళికలో లేకున్నా అమలు చేసింది. సంక్షేమ పథకాల అమలుకు దేశంలో మరే రాష్ట్రం కేటాయించనంతగా రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వ సక్సెస్ స్టోరీస్ కాగా, నెరవేర్చని హామీల జాబితా కూడా చాంతాడంత మిగిలే ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. హైదరాబాద్‌లో పూర్తిచేసిన మోడల్ కాలనీ తప్ప రాష్ట్రంలో ఈ పథకం ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. మొదటి ఏడాది 66 వేల ఇళ్లు, రెండో ఏడాది 2 లక్షల ఇళ్లు కట్టించే హామీతోపాటు రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడం, దళితులకు ఉచితంగా మూడు ఎకరాల భూపంపిణీ వంటి హామీలు నిలబెట్టుకోవడం ప్రభుత్వం ముందున్న సవాల్.

చిత్రం... రాష్ట్రానే్న సాధించాం.. అభివృద్ధీ సాధించుకుంటాం..: కెసిఆర్

వెల్జాల చంద్రశేఖర్