తెలంగాణ

నేరాల అదుపులో వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 17: జిల్లా కేంద్రం నల్లగొండలోనే పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ఎస్పీ కార్యాలయం, నిఘా విభాగాల కార్యాలయాలు ఉన్నా నేరాల అదుపులో పోలీస్ శాఖ విఫలమవుతుండటం ప్రజల్లో పోలీస్ శాఖ పనితీరు విమర్శల పాలవుతోంది. తాజాగా మిర్యాలగూడలో ప్రేమవివాహాం నేఫధ్యంలో జరిగిన ప్రణయ్ హత్యలో నిందితులుగా నల్లగొండకు చెందిన ఐఎస్‌ఐ మాజీ సభ్యులు అబ్ధుల్ బారీ, అస్గర్ అలీలు ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం వెలువడంతో మరోసారి జిల్లా పోలీస్‌శాఖ పనితీరును ప్రశ్నార్ధం చేస్తుంది. ప్రస్తుతం వారిద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రణయ్‌ను చంపిన షఫీ నల్లగొండకు చెందిన బారీ, అస్గర్‌ల అనుచరుడు కాదని బీహర్‌కు చెందిన కిరాయి హంతకుడని పోలీసులు తమ విఛారణలో గుర్తించినట్లుగా తెలుస్తుంది. నేడు పోలీసులు ప్రణయ్ హత్య కేసు విఛారణ వివరాలను వెల్లడించే అవకాశముంది. మొత్తం ఆరుగురు నుండి పది మంది వరకు నిందితులు ప్రణయ్ హత్య కేసులో ఉండగా ఎక్కువ మంది పాత నేరస్తులే కావడం గమనార్హం. కాగా, సీసీ కెమెరాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం అందుబాటులో ఉన్నా రాల నియంత్రణలో పోలీస్‌శాఖ పదేపదే వైఫల్యం చెందుతుండటం విమర్శలకు తావిస్తుంది. ముఖ్యంగా నల్లగొండకు చెందిన పాత నేరస్తులు, ఐఎస్‌ఐ, నరుూం ముఠా సభ్యులు మళ్లీమళ్లీ సెటిల్‌మెంట్ దందాలు, బెదిరింపులు, హత్యలకు పాల్పడుతున్నా వారి కదలికలపై నిఘా వేసి నేరాలు జరిగిన వెంటనే నేరస్తులను సకాలంలో గుర్తించి పట్టుకోవడంలో విఫలం చెందుతుండటంపై పోలీస్ శాఖలోనే అసంతృప్తిని రగిలిస్తుంది. జిల్లా కేంద్రం పాత నేరస్తులకు హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన ఐఎస్‌ఐ, నరుూం ముఠాలతో, సుఫారీ గ్యాంగ్‌లకు మధ్య సంబంధాలు తరుచు వెలుగు చూస్తునే ఉన్నా వారి కదలికలను పసిగట్టలేకపోవడం చర్చనీయాంశమైంది. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని నిఘా విభాగాల్లో ఓ వర్గం వారు ఏళ్ల తరబడిగా పనిచేస్తు ఉన్నతాధికారులకు సరైన సమాచారం వెళ్లకుండా చేస్తున్న నేపధ్యంలోనే పాత నేరస్తుల కార్యకలాపాలు నిర్భయంగా సాగుతున్నాయన్న వాదన పోలీస్ వర్గాల్గో వినిపిస్తుంది. అటు పోలీస్‌శాఖలో రాజకీయ జోక్యం సైతం పెరిగిపోవడంతో నేరా నియంత్రణ, పరిశోధనలు సవ్యంగా సాగడం లేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. జిల్లాలో ఏడాది కాలంలో జరిగిన నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, తదుపరి కనగల్‌కు చెందిన వ్యక్తి, నకిరేకల్‌కు చెందిన మరో వ్యక్తి హత్య కేసులో పాత నేరస్తుల ప్రమేయం బయటపడింది. మరోసారి ప్రణయ్ హత్య కేసులోను పాత నేరస్తులే నిందితులుగా ఉన్నారు.
కిరాయి మూకలతో ‘ఉగ్ర’ చెలిమి!
జిల్లా కేంద్రం ఒకవైపు సిమి, ఐఎస్‌ఐ సానుభూతిపరులకు, మరోవైపు నరుూం ముఠాకు, రౌడిషీటర్లకు అడ్డంగా ఉన్న ఉదంతాలు ఉన్నప్పటికి వారి కదలికలపై నిఘాను కొనసాగించపోతుండటం తిరిగి వారు నేరాలు చేయడానికి ఆస్కారమిస్తుంది. 1990నుండి నల్లగొండలో ఐఎస్‌ఐ కార్యకలాపాలు సాగుతున్నా హైద్రాబాద్ కార్ఖానా ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురిలో ఇద్ధరు ఐఎస్‌ఐ సానుభూతి పనులు జిల్లాకు చెందిన వారు కావడంతో తొలిసారిగా నల్లగొండ ఉగ్రమూలాలు వెలుగుచూశాయి. సిమి వ్యవస్థాపకుడు సలావుద్ధిన్ జిల్లా కేంద్రంకు చెందిన వాడేకాగా అతను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారణాసి పేలుళ్లలో సూత్రదారి గులాం ఎజ్ధాని, బెంగుళూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్తవ్రేత్తలపై కాల్పులు జరిపిన లష్కర్‌తోయిబా నేత నల్లగొండతో సంబంధాలు నెరిపారు.