తెలంగాణ

36 లక్షల ఓట్లు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్: నాలుగేళ్లకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అక్రమంగా అధికారంలోకి వచ్చేందుకు టీఆర్‌ఎస్ 36 లక్షల ఓటర్ల పేర్లను గల్లంతు చేసిందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని, ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆశించిన స్థాయిలో ముందుకువెళ్లకపోవడం వల్లనే జనం కోసం తెలంగాణ జన సమితి ఆవిర్భవించిందన్నారు. సోమవారం మండల కేంద్రమైన హవేళీఘణాపూర్‌లో పార్టీ జెండాను కోదండరాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండరన్నారు. ప్రగతి భవన్ లేదా ఫాంహౌస్‌కే పరిమితమని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు ఆంధ్రాకు మళ్లించారు, మరి తెలంగాణ ఏర్పడినాక ఎందుకు ఖర్చు చేయడం లేదన్నారు. పింఛన్ డబ్బులు రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా లేదన్నారు. కౌలు రైతులను అసలే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూంలు కేవలం పత్రికల్లో కనిపిస్తున్నాయి తప్ప భౌతికంగా ఎక్కడా కనిపిస్తలేవన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోయినా 50వేల కోట్ల రూపాయలు వృథా చేశారన్నారు. చెరువుల్లో మట్టి తీయకపోయినా కాంట్రాక్టర్‌ల జేబులు నింపుతున్నారన్నారు. మంజీరా నీళ్లు జిల్లాకు దక్కకుండా అక్రమంగా వేరే ప్రాంతాలను తరలించారని విమర్శించి స్థానిక రైతులకు అన్యాయం చేశారన్నారు. 60 మంది బస్సు ప్రమాదంలో మృతిచెందితే పరామర్శకు వెళ్లకపోవడం శోచనీయమన్నారు. ఐదేళ్ల పాలన కోసం అధికారం అప్పగిస్తే 4 యేళ్లకే ఎన్నికలకువెళ్లి అక్రమంగా అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ జనసమితి ఏర్పడిందన్నారు. పాలపిట్ట రంగు జెండా విజయానికి సూచిక అని రాబోయే దసరా విజయం ప్రజల విజయం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కె.జనార్దన్‌రెడ్డి, మండల కన్వీనర్ దొమ్మాట దుర్గారెడ్డి పాల్గొన్నారు. పెద్దయెత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

చిత్రం..పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రసంగిస్తున్న టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం