తెలంగాణ

కసరత్తులోనే విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 17: ముందస్తుకు అడుగులేసిన సీఎం కేసీఆర్ శాసనసభ రద్దు, వెనువెంటనే టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన చేయగా, విపక్షాలే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, వారు ఇంకా బలమైన అభ్యర్థుల కసరత్తుల్లోనే నిమగ్నమయ్యారు. దీనికితోడు పొత్తులు కూడా కొలిక్కిరాకపోవడంతో అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2014 ఎన్నికల్లో అధికార తెరాస 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని జిల్లాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ సీట్టింగ్‌లకే సీట్లు ఇస్తామన్న కేసీఆర్ ఒక చొప్పదండి మినహా 12సిట్టింగ్ అభ్యర్థులకే సీట్లు కేటాయించారు. అభ్యర్థుల ప్రకటన మరుసటిరోజు నుంచే సీట్టింగ్ అభ్యర్థులు ప్రచార పర్వానికి తెరలేపారు. పల్లె బాట పట్టి గ్రామాల్లోని కుల సంఘాలు, మహిళా సంఘాలతో మమేకమవుతూ ముందుకుసాగుతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రి ఈటల రాజేందర్, మరో మంత్రి కేటీఆర్‌లను మళ్లీ ఓటేస్తామని ఆయా నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు ప్రతిజ్ఞలు, తీర్మానాలు చేస్తూ అభ్యర్థుల్లో జోష్ నింపుతున్నారు. సోమవారం కూడా ఎమ్మెల్యే కమలాకర్‌కు నగర శివారు రేకుర్తి గౌడ సంఘం మద్దదు ప్రకటించి, ఆయనకే ఓటేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. షెడ్యూల్ కులాల ఆధ్వర్యంలో దళితులు కమలాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే మంత్రి ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తులు ఓటేస్తామంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే మిగితా సీట్టింగ్‌లు కూడా ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసినప్పటికీ ఇంకా విపక్షాలు అభ్యర్థుల అనే్వషణ, కసరత్తులోనే ఉన్నాయి. ఏలాగైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు ఓ వైపు బ్యాలెట్ వార్‌లో అనుసరించాల్సిన వ్యూహాల్ని రూపొందించుకుంటూనే, మరోవైపు గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు దీటైనా అభ్యర్థుల కోసం కసరత్తులు చేస్తున్నారు. అయితే, కూటమి కొలిక్కిరాకపోవడంతో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు ఒంటరిగా బరిలో దిగాలన్ని నిర్ణయించుకున్న బీజేపీ కూడా బలమైన అభ్యర్థుల కోసం అనే్వషిస్తున్నారు. కరీంనగర్‌కు బండి సంజయ్‌కుమార్, పెద్దపల్లికి గుజ్జుల రామకృష్ణారెడ్డి, రామగుండంకు బల్మూరి వనిత, హుస్నాబాద్‌కు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మానకొండూర్‌కు గడ్డం నాగరాజు, సిరిసిల్లకు ఆకుల విజయ, వేములవాడకు ప్రతాప రామకృష్ణల పేర్లు దాదాపు ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటునప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. కాగా, కేసీఆర్ ప్రకటించిన సీట్టింగ్‌లో ఒకరిద్దరికి బీఫారాల అందించే సమయంలో తప్పించవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ ఒక్కరిద్దరూ ఎవ్వరుకానున్నారో అన్న ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొనగా, అలాంటిదేమి ఉండదని సిట్టింగ్ అభ్యర్థులు కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి విపక్షాలు అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉండగా, తెరాస అభ్యర్థులు మాత్రం తమతమ నియోజకవర్గాల్లో దూకుడు పెంచుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

చిత్రం..కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్న దళితులు