తెలంగాణ

మంగళసూత్రాలు తీయాలనలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: వీఆర్వో పరీక్షకు హాజరైన మహిళా అభ్యర్థుల మంగళసూత్రాలను తొలగించాలని కొన్ని కేంద్రాల్లో పర్యవేక్షక సిబ్బంది నిర్బంధం చేయడంతో వారు మంగళసూత్రాలను తీసేసి తమతో వచ్చిన కుటుంబ సభ్యులకు అందజేసిన ఘటనపై పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి ఎ వాణీ ప్రసాద్ సోమవారం స్పందించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ అలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు ఏవీ ఇవ్వలేదని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలు, ఏర్పాట్లు మెచ్చుకోని మీడియా ఒకటి రెండు సంఘటనలను మాత్రమే చూపించి ప్రచారం చేయడం సరికాదని కూడా ఆమె అన్నారు. తప్పు టీఎస్‌పీఎస్‌సీది కాదని, తప్పంతా మీడియాదేనన్న రీతిలో కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీఆర్వో పరీక్ష రాసేందుకు వెళ్లిన మళిళ మంగళసూత్రాలు తీయించిన అధికారుల చర్యలను టీఎస్‌పీఎస్సీ తనదైన శైలిలో సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసినా మీడియా వాటిని పట్టించుకోలేదని, చిన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. కమిషన్ ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపించామని, టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష కేంద్రాన్ని బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది.
28 నుండి గురుకులాల ఎంపిక పరీక్షలు
ఈ నెల 28 నుండి గురుకులాల పీజీటీ, టీజీటీ ఎంపిక పరీక్షలు జరుగనున్నాయి. పీజీటీ తెలుగు, సంస్కృతం 28న, పీఎస్ 29న, మాథ్స్ 1న, సోషల్ అక్టోబర్ 3న, బయోలజీ అక్టోబర్ 3న ఇంగ్లీషు 8న జరుగుతాయి. పేపర్-2, పేపర్ 3 ఉదయం , సాయంత్రం జరుగుతాయి. పేపర్ - 1 అందరికీ కామన్ కనుక అది అక్టోబర్ 6న జరుగుతుంది. అలాగే టీజీటీ మాథ్స్ అక్టోబర్ 11న, ఇంగ్లీషు 12న ఎస్‌ఎస్, బయోలజీ 13న, తెలుగు సంస్కృతం 22న, పీఎస్ 23న, సైన్స్ 24న జరుగుతాయి. హాల్‌టిక్కెట్లు ఈ నెల 21 నుండి జారీ చేస్తారు.