తెలంగాణ

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు: నాయని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ పాత్రే లేదని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కేంద్రంపై వత్తిడి పెంచడానికి రాజీనామా చేద్దామంటే ఆ పార్టీ నాయకుడు జి కిషన్‌రెడ్డి పారిపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి నాయిని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విమోచన దినాన్ని ఎందుకు నిర్వహించడం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నించారని, కిషన్‌రెడ్డి అప్పట్లో రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి నోట్ల రద్దు, జీఎస్‌టి అమలు అంశాలలో తెలంగాణ ప్రభుత్వం సహకరించిందని గుర్తు చేసారు. కాంగ్రెస్ నేతలైతే తెలంగాణకు ద్రోహం చేసిన ప్రబుద్ధులని నాయిని ధ్వజ మెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని, రాష్ట్రం అంధకారం అవుతుందని ఆంధ్రపాలకులు చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు ఎందుకు తలదూరుస్తున్నారని నాయిని ప్రశ్నించారు. టిడిపి, కాంగ్రెస్ దోస్తి వెనుకనున్న ఆంతర్యం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ విలీనంపై మాట్లాడే నైతిక అర్హత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పాత్రేలేదన్నారు.