తెలంగాణ

గనుల శాఖలో ఎలక్ట్రానిక్ పని విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్ర గనుల శాఖలో పనివిధానాన్ని ఎలక్ట్రానిక్ తరహాలో నిర్వహించేందుకు వీలుగా ‘ఈ-ఆఫ్‌స్’ ను సోమవారం ప్రారంభించారు. గనుల శాఖ ప్రధాన కార్యాలయంలో ‘మిషన్ మోడ్ ప్రాజెక్టు’ (ఎంఎంపీ) గా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు గనుల శాఖ డైరెక్టర్ బీఆర్‌వీ సుశీల్‌కుమార్ వెల్లడించారు. ఎంఎంపీని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ లాంఛనంగా ప్రారంభించారు. గనుల శాఖలో ఈ-ఆఫీస్ పూర్తిస్థాయిలో 2018 అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఆఫీస్ వల్ల పనితీరు మెరుగవుతుందని, ఫైళ్ల కదలికలను ఉన్నతాధికారులు ఎప్పటిప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుందని డైరెక్టర్ తెలిపారు.