తెలంగాణ

భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సైదాబాద్, సెప్టెంబర్ 17: అక్రమ పాస్ పోర్టు ఆరోపణల కేసులో చంచల్‌గుడాలో నిందితునిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని ఆ పార్టీ నాయకులు కలిసి పరామర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి సతీమణి నిర్మల, మాజీ మంత్రి జే.గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు సోమవారం జగ్గారెడ్డిని కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని, 13 ఏళ్ల క్రితంనాటి కేసులో జగ్గారెడ్డిని అక్రమంగా ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు. తమ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని, జగ్గారెడ్డిపై అక్రమ అరెస్టు ఇందుకు నిదర్శనమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను కేసీఆర్ కుటుంబం దొంగల ముఠాలా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఆయన దుయ్యబట్టారు. మానవ అక్రమ రవాణా కేసులో అసలు దోషులు కేసీఆర్, హరీష్‌రావు అని అన్నారు. జగ్గారెడ్డి ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించిన అధికారుల సంగతి చూస్తామని ఉత్తమ్ హెచ్చరించారు.
నన్ను జైలులో పెట్టించేందుకు కుట్ర రేవంత్ మండిపాటు
అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తనను జైలులో పెట్టించేందుకు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనను చూసి టీఆర్‌ఎస్ భయపడుతున్నదని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. పార్టీ తనకు కీలక బాధ్యత అప్పగిస్తే టీఆర్‌ఎస్‌కు ఇబ్బంది ఉంటుందని భావించిన కేసీఆర్, ముందుగానే తనపై తప్పుడు కేసులతో అరెస్టు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకు, తన కుటుంబానికి ఏమి జరిగినా దానికి అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ వి. మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కేంద్ర నిఘా సంస్థలతో తనపై దాడులు చేయించేందుకు కేసీఆర్‌కు బీజేపీ హామీ ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందన్నారు. తనపై వంద అక్రమ కేసులు పెట్టినా సహించేది లేదని, లెక్క మిత్తీతో సహా చెల్లించేలా చేస్తామన్నారు.