తెలంగాణ

బాబుకు అరెస్టు వారెంట్ కుట్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు , ప్రధాని నరేంద్రమోదీ కలిసి కుట్రపన్ని చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ధ్వజమెత్తారు. బాబ్లీ ప్రాజెక్టు పూర్తయితే ఎస్సారెస్పీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆనాడు చంద్రబాబునాయుడు పోరాటం చేశారని గుర్తుచేశారు. ఈ మేరకు మధ్యాహ్నం తెదేపా ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ అధినేతకు వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుందనే ఇలాంటి కక్ష పూరిత చర్యలకు దిగుతున్నారని అన్నారు. భేషరతుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులను ఎత్తివేయాలని, నాన్ బెయిలబుల్ వారెంటును ఉపసంహరించుకోవాలని కోరారు. తమ నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా చూస్తూ ఊరుకునేదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ సహా 13 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని 2010 జూన్ 16న ధర్మాబాద్‌లో బాబ్లీకి టీటీడీ నేతలు చంద్రబాబునాయకత్వంలో వెళ్లే ప్రయత్నంలో జరిగిన ఘర్షణకు సంబంధించి ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌పై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బాబ్లీ సందర్శనకు అనుమతి లేదంటూ తెలుగుదేశం ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి నిర్బంధించారు. ఐదు రోజులు తర్వాత ఎలాంటి కేసులు లేవని చెప్పి ప్రత్యేక విమానంలో ప్రభుత్వమే వారందరినీ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారని, సంఘటన జరిగిన 8 ఏళ్ల తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు , మరో 14 మందిపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ కావడంపై కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు.ఆనాడు విపక్షనాయకుడిగా తెలంగాణను ఏడారిగా మార్చే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీ నేతలు ధర్మాబాద్ వెళ్లారని, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అరెస్టు వారెంట్లు రద్దు చేయాలని కేసులు ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని టీడీపీ నేతలు కోరారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పత్రాన్ని అందజేశారు. రాజకీయంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని టీటీడీపీ నేతలు చూస్తున్నారు.

చిత్రం..చంద్రబాబుకు బెయిల్ వారెంట్ల జారీపై గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు