తెలంగాణ

రిజ్వీని మించిపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రశ్నించారు. విలీనదినోత్సవాన్ని మహారాష్ట్ర,కర్నాటక రాష్ట్రాలు కూడా జరుపుకుంటున్నాయని చెప్పారు. ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెలుగదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రమణ జాతీయ జండాను ఆవిష్కరించారు. కాశింరజ్వీకి మరో స్వరూపం కేసీఆర్ అని ఆయన విమర్శించారు. 2019 సెప్టెంబర్ 17నాటికి మహాకూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని , అపుడు ప్రభుత్వం తప్పకుండా అధికారికంగా విలీన దినోత్సవాన్ని జరుపుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు కాకముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని, అసమర్ధ ముఖ్యమంత్రిగా ఆయన మిగిలిపోయారని అన్నారు. శాశ్వతంగా కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉండే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పిరు. సబండవర్గాల ఆశయాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడిఆశలయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పునాకృతి పేరుతో వేల కోట్ల రూపాయిలు కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందని, ఆ లేఖ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తోందని అన్నారు. ప్రగతి భవన్‌ను కేసీఆర్ ఖాళీ చేసేంత వరకూ పోరాడతామని అన్నారు. బస్సు ప్రమాదం జరిగిన కొండగట్టు వద్ద స్థూపం కడతామని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఆదుకుంటామని చెప్పారు.

చిత్రం..ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవంలో టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తదితరులు