తెలంగాణ

మారుతీరావును కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావును కఠనంగా శిక్షించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ హత్యకు అగ్రకుల దురహంకారమే కారణమని మండిపడ్డారు. ఈ హత్య వ్యవహారంలో నరుూం అనుచరులకు, టీఆర్‌ఎస్ నేతలకు సంబంధాలున్న విషయం బయటపడుతుందనే నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రణయ్ హత్యను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తోందని ఆయన చెప్పారు. తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లపై మాట్లాడుతూ, ప్రబోధానంద స్వామిని అరెస్టు చేయాలని, కలెక్టర్ లేదా ఎస్పీ ఆధ్వర్యంలో ఆశ్రమాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. అనంతపురం ప్రబోధానంద స్వామి ఆశ్రమంలో మారణాయుధాలు సమకూర్చుకున్నాడని నారాయణ ఆరోపించారు.
అమృతను అసెంబ్లీకి పంపుదాం: తమ్మినేని
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కుల, ధన దురహంకార హత్యకు గురైన ప్రణయ్‌కుమార్ భార్య అమృతవర్షిణిని ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపుదామని, ఇందుకు అన్ని పక్షాలు అంగీకరించాలని సీపీఎం, బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. మంగళవారం మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ఇంటిని సందర్శించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, తల్లిదండ్రులు హేమలత, బాలస్వామి, భార్య అమృతవర్షిణి ప్రణయ్, తమ్ముడు అజయ్‌కుమార్‌లను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రణయ్‌కుమార్‌ది తెలంగాణలో 14వ హత్య అని పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని ఇలా దారుణంగా హత్య చేయడం అన్యాయమన్నారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, జాన్‌వెస్లీ, శ్రీరాంనాయక్, తుమ్మల వీరారెడ్డి, మల్లేష్, వెంకటేశ్వర్లు, జగదీశ్‌చంద్ర, రవినాయక్‌లున్నారు.

చిత్రం..ప్రణయ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తదితరులు