తెలంగాణ

సర్వేలు స్టిల్ ఫొటోల వంటివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సర్వేలు స్టిల్ ఫొటోల వంటివని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అన్నారు. విపరీతంగా డబ్బులు కురిపించి సర్వేలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం ప్రొఫెసర్ కోదండరామ్ తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సర్వేలతో నిరంతర మార్పులు జరుగుతుంటే సర్వేల్లో ఏలా స్పష్టత వస్తుందని ప్రశ్నించారు. తృప్తి కోసమే సర్వేలని ఆయన అన్నారు. సర్వేలను టీఆర్‌ఎస్‌ను రాజకీయ అస్త్రంగా వాడుకోవాలనుకుంటున్నదని ఆయన విమర్శించారు. గతంలో పంచాంగాలను, ఇప్పుడు సర్వేలను వాడుకోవాలనుకుంటున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేలా ఇటీవల వాట్సాప్‌లో తిరుగుతున్న అంశం గురించి ప్రశ్నించగా, ఏ సర్వే అయినా నిరంతర మార్పులను చూపించలేవని, అవి స్టిల్ ఫొటో వంటివేనని ఆయన బదులిచ్చారు. పొత్తులు, మహాకూటమి గురించి ప్రశ్నించగా, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే కూటమి ఉంటుందని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.