తెలంగాణ

పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష అక్టోబర్ 10కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాతపరీక్ష వాయిదా పడింది. అక్టోబర్ 4న జరగాల్సిన ఈ పరీక్షకను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు పరీక్ష కన్వీనర్ నీతూ ప్రసాద్ చెప్పారు. పేపర్-1 ఉదయం 10 నుండి 12 వరకూ, పేపర్ -2 మధ్యాహ్నం 3 నుండి 5 వరకూ జరుగుతాయని అన్నారు. మొత్తం 9355 పోస్టులకు గానూ 5,62,424 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. 4వ తేదీన ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పరీక్ష వాయిదా పడినట్టు అధికారులు చెప్పారు.
రేపటి నుండి జాతీయ ఓపెన్ స్కూల్ పరీక్షలు
నేషనల్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు సెప్టెంబర్ 20 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్ 5 వరకూ జరుగుతాయి. తొలుత ప్రాయోగిక పరీక్షలు జరుగుతాయి. అనంతరం థియిరీ పరీక్షలు ఉంటాయి. థియిరీ పరీక్షలు అక్టోబర్ 6 నుండి నవంబర్ 5వ తేదీ వరకూ జరుగుతాయని ప్రాంతీయ సంచాలకుడు అనిల్‌కుమార్ తెలిపారు. అభ్యర్ధుల హాల్‌టిక్కెట్లను నేషనల్ ఓపెన్ స్కూల్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.