తెలంగాణ

పోలీసుల పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పడానకి హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని, దీంతో పోలీసుల పనితీరు భేష్ అంటూ తెలంగాణ పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కితాబ్ ఇచ్చారు. మంగళవారం కేంద్ర మంత్రి హాన్స్‌రాజ్ గంగారాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శంచారు. ఈయన వెంట తాజా మాజీ ఎమ్మెల్యే సీనియర్ బిజేపి నేత చింతల రామచంద్రారెడ్డితో పాటు రాష్ట్ర డీజీపి మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్ అంజనీకుమార్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నిర్వహణతీరుతో పాటు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానకి వచ్చే ప్రజలకు కల్పించిన సౌకార్యలు అబ్బుర పరుస్తున్నాయని మంత్రి కొనియాడారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌పై అన్ని కోణాల్లో పరిశీలించిన అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న తీరును ఆయన ప్రశింసించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకువస్తున్న విజన్‌లో భాగంగా స్మార్ట్ పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడంతో నేరాల సంఖ్యను తగ్గించడానికి అవకాశం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడంతో నేరాలను అదుపుచేశారని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని అభినంధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. మహిళలల భద్రతకు తీసుకువచ్చిన షీ-టీమ్ పనితీరు భాగుందన్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో రానున్న రోజుల్లో కూడా పోలీస్ వ్యవస్థ మరింత చురుకుదనాన్ని పాటించాల్సిందిగా ఆయన సూచించారు. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరించాల్సి అవసరం ఉందన్నారు. నేరస్తుల నుంచి భయాన్ని తొలగిపోయే విధంగా ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆయన పోలీస్ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపి మహేందర్‌రెడ్డి పోలీస్ శాఖ తీసుకవస్తున్న ముఖ్యమైన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఎఫ్‌ఆర్‌సీ అమలు చేసిన ఘనత తెలంగాణ పోలీసులకు దక్కిందని, ఈప్రక్రియలో నేరస్థులు ఎక్కడ నేరం చేసినా క్షణాల్లో సమాచారం అందుతోందన్నారు. దేశ, రాష్టస్థ్రాయిలో గతంలో నేరం చేసిన నేరస్థుడు ముఖకవికలను ఎఫ్‌ఆర్‌సీ ఇట్లే గుర్తు పట్టేస్తుందని డీజీపి మంత్రికి వివరించారు. తెలంగాణలో ఎఫ్‌ఆర్‌సీ తీసుకురావడంతో ఎక్కడ పోలీసులకు దొరికిపోతామన్న భయంతో దొంగలు పారిపోతున్నారని చెప్పారు. నగర కమిషనర్ అంజనీకుమార్ హైదరాబాద్‌లో పోలీసులు చేపడుతున్న భద్రత అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినందుకు మంత్రిని అధికారులు అభినంధించారు.

చిత్రం..పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాంకు
పుష్పగుచ్ఛం ఇస్తున్న రాష్ట్ర డీజీపి మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్ అంజనీకుమార్