తెలంగాణ

‘కారు’ యమస్పీడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలు అందుకోలేనంత వేగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కలిసోచ్చే ఇతర విపక్షాలతో మహాకూటమి ఏర్పాటుకు ఇంకా మీనమేషాలు లెక్కబెడుతుండగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మహాకూటమిలో పొత్తులు కుదిరి సీట్లు ఖరారై అభ్యర్థులను ప్రకటించే నాటికి మొదటి, రెండవ దశ ప్రచారాన్ని ముగించే విధంగా ప్రణాళికను రూపొందించుకుంది. అభ్యర్థులను ప్రకటించిన 105 స్థానాలలో 10-15 నియోజకవర్గాలలో అసమ్మతీయుల బెడద వల్ల ప్రచారం ముందుకుసాగడం లేదు. అయితే మిగిలిన నియోజక వర్గాల్లో మాత్రం ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారంపై ప్రతీ రోజు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎన్నికల ప్రచార మెటిరియల్‌తో పాటు అభ్యర్థుల ఖర్చుల కోసం పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నిధులు చేరవేసినట్టు నియోజకవర్గాల నుంచి సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత అభ్యర్థులకు నిధుల చేరవేత అతి పెద్ద సమస్య. ఆ సమస్య రాకముందే అభ్యర్థులకు నిధులు చేరవేయడం టీఆర్‌ఎస్ వ్యూహం. ఎన్నికల ఖర్చుల కోసం పంపిన నిధులను కొందరు అభ్యర్థులు ఖర్చు పెట్టకుండా మిగుల్చుకునే వారుంటే, మరికొందరు పార్టీ పంపించే నిధులకంటే ఎక్కువ ఖర్చు పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఎన్నికల వ్యయాన్ని టీఆర్‌ఎస్ అధిష్టానం వికేంద్రీకరించినట్టు సమాచారం. అభ్యర్థులతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు నేరుగా నిధులు పంపిస్తోన్నట్టు సమాచారం. వీరు ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులను దెపరించకుండా అధిష్టానమే నిధులు పంపిస్తున్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులలో దాదాపు సగం మంది పార్టీ నిధులపై ఆధారపడాల్సిన అవసరం లేని ఆర్థికంగా స్థోమత కలిగిన వారే ఉన్నారు. అయినప్పటికీ మొదటి విడతలో అభ్యర్థులు అందరికీ సమానంగా అధిష్టానం నిధులు చేరవేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ నిధుల చేరివేత నుంచి ఏడేనిమిది మంది అభ్యర్థులను మినహాయించినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు ఎంఐఎం సిట్టింగ్ స్థానాలకు ప్రకటించిన డమీ అభ్యర్థులు కాగా మిగతా ఆరుగురు ఉన్నట్టు తెలిసింది. వీరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉండటం వల్లనే నిధులు పంపించి ఉండకపోవచ్చని సమాచారం. ఇలా ఉండగా అభ్యర్థుల ప్రచారంపైనే కాకుండా వారు పెడుతోన్న ఖర్చుపై కూడా నిఘా వర్గాల ద్వారా అధిష్టానం సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలిసింది.