తెలంగాణ

నీటి పారుదల శాఖకు భూముల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకు భూముల సేకరణకు సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ల్యాండ్ అక్విజేషన్ యూనిట్లకు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమిస్తోంది. ఐ అండ్ క్యాడ్ శాఖకు వీరు సహాయంగా ఉంటారు. దాదాపు అన్ని జిల్లాలకు డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. అవసరాన్ని అనుసరించి ఒకరు, ఇద్దరు, లేదా అంతకు మించిన సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తున్నారు. ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి వీరు పనిచేయాల్సి ఉంటుంది. భూముల సేకరణ, పరిహారం చెల్లింపులో జాప్యం కాకుండా, యుద్ధప్రాతిపదికన పనులు జరిగేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ జిల్లాలకు డిప్యూటీ కలెక్టర్లను నియమించగా, మంగళవారం నల్లగొండ జిల్లాకు గోపాల్‌ను, పీ. సాయిరాంలను నియమించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.