తెలంగాణ

పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: పంచాయితీ కార్యదర్శులకు (గ్రేడ్-1) వీడీఓల తరహాలో ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వీడీఓలకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ వీరిని మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాల్లో నియమిస్తున్నారు. పంచాయితీ కార్యదర్శులు జీవితాంతం అదే పోస్టులో కొనసాగాల్సి వచ్చేది. ఇప్పుడు పంచాయితీ కార్యదర్శులకు (గ్రేడ్-1) ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించి, ఖాళీ అయ్యే సూపరింటెండెంట్ల ఖాళీల మొత్తం ప్రమోషన్ల స్థానాల్లో 10 శాతం రిజర్వేషన్లు వీరికి కల్పించారు.