జాతీయ వార్తలు

తప్పును సరిదిద్దబోయి.. పప్పులో కాలేసిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యుడిగా నియమిస్తూ చేసిన తప్పును బుధవారం రాత్రి సరిదిద్దుకోవటంలో పప్పులో కాలేసింది. తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ జాబితా నుండి సురేష్‌రెడ్డి పేరు తొలగించిన అధినాయకత్వం ఎన్నికల కమిటీ నుండి ఆయన పేరు తొలగించటం మరిచిపోయింది. అంటే సురేష్‌రెడ్డిని మూడు కమిటీల్లో సభ్యుడిగా నియమించిన విషయం కాంగ్రెస్ అధినాయత్వానికి తెలియదన్న మాట. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఈ మేరకు ఒక ప్రకటన జారీచేశారు. తన తప్పును సరిదిద్దుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం వివిధ కమిటీల్లో కొందరు కొత్తవారికి స్థానం కల్పించింది. ప్రముఖ సినీనటి విజయశాంతిని ముఖ్య ప్రచారకర్త (స్టార్ క్యాంపెయినర్)గా నియమించటంతోపాటు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీకి సలహాదారు బాధ్యతలు కూడా ఇచ్చింది. భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాంపెయిన్ (ప్రచార) కమిటీని నియమించిన కాంగ్రెస్ అధినాయకత్వం రాత్రి పొద్దుపోయిన తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేసి గందరగోళం సృష్టించింది. క్యాంపెయిన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ మధ్య తేడా ఏమిటనేది కాంగ్రెస్ వివరించలేకపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరుగుబాటుకు సిద్ధంకాగానే ఆయనను బుజ్జగించేందుకు కొత్తగా పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా నియమించారనే మాట వినిపిస్తోంది. పబ్లిసిటీ కమిటీలో సుదాగర్ గంగారాంను కోచైర్మన్‌గా నియమించి దాసోజు శ్రవణ్, కె.శ్రీశైలం గౌడ్‌లను సభ్యులుగా నియమించటం గమనార్హం.