తెలంగాణ

ప్రశాంతంగా శోభాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: జంటనగరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గణేష్ శోభాయాత్ర ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు గణేష్ శోభాయాత్రను తిలకించడానికి జంటనగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనసంద్రమయ్యాయి. గణేష్ శోభాయాత్రకు వచ్చిన భక్తజనాన్ని అంచనావేయడానకి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు డిజిపి మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ఏరియల్ సర్వే అరంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీసు అధికారులతో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 11 రోజుల పాటు పూజలు అందుకుని, చివరి రోజు గణనాథుల నిమజ్జనానికి లక్షలాది మంది తరలిరావడం చరిత్రలో నిలుస్తుందని అన్నారు. ఇంతటి చరిత్ర కల్గిన గణనాథుల శోభాయాత్రలో ఎలాంటి అవాంచనీ సంఘటనలు జరగకుండా బందోబస్తును పర్యవేక్షించిన పోలీసులకు ఆయన కితాబు ఇచ్చారు. ఎలాంటి సంఘటనలు అయినా ఎదుర్కోవడానకి పోలీసులు కర్తవ్యంతో సాధిస్తారని చెప్పడానకి శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించన ఘనత పోలీసులకు దక్కిందన్నారు. తెలంగాణ జిల్లాల్లో గణేష్ శోభాయాత్రను హైదరాబాద్ నుంచి డిజిపి మహేందర్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో పర్యవేక్షించారు. శోభాయాత్రతో ట్రాఫిక్ నిలచిపోడంతో కమాండ్ కంట్రోల్ నుంచి పోలీసు అధికారులకు డిజిపి సూచనలు చేశారు. మన్సూరాబాద్ ఆగమయ్య నగర్‌లో గణేష్ శోభాయాత్ర పాల్గొన్న రవికుమార్ విద్యుదాఘాతం మృతి చెందారు. ఈ ఏరియల్ సర్వేలో జంటనగరాల్లో శోభాయాత్ర పాల్గొన్న వివిధ గణనాథుల ఊరేగింపు, పోలీసుల భద్రతను పర్యవేక్షించారు. గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం..ట్యాంక్‌బండ్ వద్ద జనం..