తెలంగాణ

తెలంగాణ గుండెచప్పుడు తెరాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో ఎన్ని మహాకూటములు ఏర్పడ్డ టీఆర్‌ఎస్‌ను కదిలించలేవని.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్‌ఎస్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో మంత్రి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు,, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చేతకాకే పొత్తుల పేరిట ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీల దోస్తు విచిత్రమైందని.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం అని.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేకమని అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో దోస్తి చేయడం ప్రజలు విశ్వసించరని అన్నారు. చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ఆత్మక్షోభించేలా నిర్ణయం తీసుకున్నారని ఎన్టీఆర్ కుటుంబాన్ని నారా కుటుంబం అవమానిస్తుందని ఆరోపించారు. వీరి కలయిక అనైతికమని ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని అదే తరహలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే కాంగ్రెస్‌తో కూటమిల పేరుతో దోస్తి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజానికం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని ఎన్ని కూటములు వచ్చిన తాము మాత్రం కేసీఆర్ పక్షాన ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఇంకా ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారంటే అందుకు ప్రధాన ముద్దాయిలు కాంగ్రెస్, టీడీపీ నాయకులేనని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మిస్తుంటే వాటిని అడ్డుకునేందుకు కేసులు వేసిన దుర్మార్గులు కాంగ్రెస్ వారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో తాము గెలుస్తామని తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండవ సారి పదవిలోకి రానున్నారని తెలిపారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతా కనబడుతుందని కేవలం ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు మాత్రం పచ్చకామెర్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి ఆగిపోకూడదంటే మళ్లీ ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని ఆయన కోరారు.
కాంగ్రెస్, టీడీపీ నాయకుల పాలన పుణ్యంగా వైద్య ఆరోగ్యశాఖను చెదలు పట్టించారని ఆ చెదలను తొలగించడం చాలా కష్టంగా మారిందని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మార్పులు తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ప్రభాకర్‌రెడ్డి, కిషన్‌జీ, నర్సిములు, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. రాజాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రచార సభలో ప్రసంగిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి