తెలంగాణ

కాంగ్రెస్..టీడీపీలతో పొత్తా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకోమని ఏ అమరుడు చెప్పారని తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌పై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా యువత అమరులు కావడానికి కారణమైన కాంగ్రెస్, టీడీపీలతో పొత్తును ఎలా సమర్ధించుకుంటారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మర్యాదగా ఏమి ఇవ్వలేదని, వీపు చింతపండు అవుతుందన్న భయంతోనే ఇచ్చిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వవద్దని కేంద్రానికి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 30 లేఖలు రాసారని కేటీఆర్ గుర్తు చేసారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడుతోన్న చంద్రబాబుతో పొత్తేమిటనీ ఆయన నిలదీసారు. టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఏర్పడింది మహాకూటమీ కాదని, అదొక స్వాహా కూటమి అని కేటీఆర్ దుయ్యబట్టారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు అమరావతికి బానిసలుగా మారాల్సిందేనని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. చంద్రబాబు సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించే ఆలోచిస్తారని, అలాంటప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదండరామ్ ఏ విధంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని ఆయన నిలదీశారు. రైతులను కాల్చి చంపిన రాబందులు ఒక్కటయ్యారని మండిపడ్డారు. మహాకూటమికి ఓట్లు వేసి ఢిల్లీకి గులాములు అవుతారా? అమరావతికి బానిసలుగా మారుతారా? ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చే హామీలకు దక్షిణ భారత రాష్ట్రాల బడ్జెట్ మొత్తం ఖర్చు చేసినా సరిపోదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ్ ఇచ్చే హామీలను అమలు చేస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.