తెలంగాణ

విపక్షాలకు ఓట్లడిగే నైతిక హక్కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 24: అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే నైతికహక్కు లేదని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గుంటిపల్లిలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అభివృద్ధిని కళ్ళుండీ చూడలేకపోతున్న ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా 6 నెలల్లో కాళేశ్వరం నీటితో కాల్లు కడుగుతామని, బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, వలసలు, కరువు పరిస్థితులు నెలకొనక తప్పదని, రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్‌ను తిరిగి గజ్వేల్ నుండి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిద్దామని చెప్పారు. స్వార్థ రాజకీయాలు, అవకాశవాద ఎజెండాతో కుమ్ముక్కైన ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఏమి ఒరగబెడతారని, టీఆర్‌ఎస్‌ను గద్దె దించడం వారి తరం కాదని ఎద్దేవా చేశారు. ఆరిపోయే దీపంలాంటి కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రయోజనం ఉండదని అన్నారు. గజ్వేల్ భవిష్యత్తు, దశాదిశల మార్పు కోసం పార్టీ శ్రేణులు తమ మధ్య విభేదాలు పక్కనబెట్టి కేసీఆర్ గెలుపు కోసం ఇప్పటి నుండే కష్టపడాలని, ప్రస్తుత సర్వేతో ఇప్పటికే 100 సీట్లు గెలుచుకోనున్నట్లు చెప్పారు. మాట తప్పని, మడమ తిప్పని నేత కేసీఆర్ కాగా, రైతుల శాశ్వత ప్రయోజనంతో పాటు ఆత్మహత్యల నివారణకు ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, అవి చివరిదశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో ఉసిర్లు వచ్చినట్లుగా ప్రతిపక్ష పార్టీల నేతలు గ్రామాల్లోకి వస్తుండగా, వారిని తిప్పి పంపించి ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు. కాగా నియోజకవర్గంలోనే మొదటగా గుంటిపల్లి గ్రామం ఏకగ్రీవ తీర్మానం చేసిన ఘనత దక్కించుకుంటుండగా, గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.